Afghan Crisis: ఆఫ్ఘన్ లో అప్పుడే ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా తాలిబన్ కమాండర్ ముల్లా అబ్దుల్ ఖయూమ్ జకీర్ !

| Edited By: Anil kumar poka

Aug 26, 2021 | 10:11 AM

ఆఫ్ఘనిస్థాన్ లో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తుండగా మరోవైపు కీలక శాఖల్లో పదవులను తాలిబన్లు భర్తీ చేస్తున్నట్టు వార్తలందుతున్నాయి. తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా కమాండర్ ముల్లా అబ్దుల్ ఖయూమ్ జకీర్ ను

Afghan Crisis: ఆఫ్ఘన్ లో అప్పుడే ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా తాలిబన్ కమాండర్ ముల్లా అబ్దుల్ ఖయూమ్ జకీర్ !
Interim Govt In Afghanistan
Follow us on

ఆఫ్ఘనిస్థాన్ లో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తుండగా మరోవైపు కీలక శాఖల్లో పదవులను తాలిబన్లు భర్తీ చేస్తున్నట్టు వార్తలందుతున్నాయి. తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా కమాండర్ ముల్లా అబ్దుల్ ఖయూమ్ జకీర్ ను నియమించినట్టు తాలిబన్ వర్గాలను ఉటంకిస్తూ అల్ -జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఈయన 2007 వరకు గ్వాటమాలా బే లోని జైల్లో ఖైదీగా ఉన్నాడు. 2001 లో ఇతడిని అమెరికా దళాలు అరెస్టు చేశాయి. ఇటీవలే విడుదల చేసి ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పగించారు. నాడు కరడు గట్టిన ఉగ్రవాదులను అమెరికా ఈ జైలుకు తరలించేది. ముఖ్యంగా తాలిబన్ ఉగ్రవాదులు కొన్నేళ్లపాటు ఇక్కడ ఖైదీలుగా ఉన్నారు. కాగా తాము ఇంకా పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని, అంతవరకూ పాలన కొనసాగించాల్సి ఉందని.. అందువల్లే కొన్ని పదవుల్లో ఈ నియామకాలు జరిగాయని తాలిబన్ల అధికార ప్రతినిధి జహీహుల్లా ముజాహీద్ తెలిపారు. ప్రభుత్వ, బ్యాంకింగ్ సంస్థలను నిర్వహించడానికి, ప్రజల సమస్యలను తీర్చడానికి ఈ నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా తాత్కాలిక ఆర్ధిక మంత్రిగా గుల్ ఆఘా, తాత్కాలిక హోమ్ మంత్రిగా సాదిర్ ఇబ్రహీం నియమితులయ్యారు.

హద్ మహ్మద్ ఇద్రిస్ ని దా ఆఫ్ఘనిస్థాన్ బ్యాంక్ (సెంట్రల్ బ్యాంక్) తాత్కాలిక హెడ్ గా నియమించారు. ఇలా ఉండగా తమకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఆఫ్ఘన్ల అవసరం ఉందని, దేశం మళ్ళీ ఆర్ధిక పునరుజీవనాన్ని సంతరించుకోవలసి ఉందని జహీహుల్లా అన్నారు. అందువల్లే దేశం వదిలి వెళ్లరాదని తాము ఆఫ్ఘన్లను కోరుతున్నామన్నారు. ఇప్పటికే తమకు వివిధ వర్గాల నుంచి నిధుల ‘సరఫరా’ ఆగిపోయిందని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తమ నిధులను స్తంభింపజేశాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

ఆగిపోయే పెళ్లిని నెటిజన్స్‌ అండతో పేదింటి అమ్మాయికి ఘనంగా పెళ్లి..:Netizes‌ Support For Poor Girl Video.

మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.

5 అడుగులు ఉన్న భారీ నాగుపాముని చాకచక్యంగా పట్టి డబ్బాలో బంధించాడు..:Cobra Video Viral.