తన ఇంట్లో తాలిబన్ల కోసం వేచి చూస్తున్నానని, వచ్చి తనను హతమార్చాలని ఆఫ్ఘన్ తొలి మహిళా మేయర్ జరీఫా గఫారీ కోరింది. నాకు, నా కుటుంబానికి సాయం చేసేవారెవరూ లేరు.. నా భర్త నా పక్కనే కూర్చున్నారు’ నన్ను చంపండి అని ఆమె అభ్యర్థించింది.తాలిబన్లు కాబూల్ నగరాన్ని వశపరచుకున్న అనంతరం ఆమె..తనను, తనలాంటి మహిళలను వారు చంపవచ్చునని నిర్వేదంగా వ్యాఖ్యానించింది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని 27 ఏళ్ళ జరీఫా ప్రశ్నిస్తోంది. 2018 లో ఈమె మైదాన్ వర్దాక్ ప్రావిన్స్ తొలి మహిళా మేయర్ గా ఎన్నికైంది. చిన్న వయస్సులోనే ఈ పదవికి ఎన్నికైనందుకు నాడు అంతా ఈమెను ప్రశంసించారు. అయితే బహుశా ఇందుకు ఆమెకు తాలిబన్ల నుంచి బెదిరింపులు అందాయి. ఈమె తండ్రి జనరల్ అబ్దుల్ వాసి గఫూర్ ని వారు గత ఏడాది నవంబరు 15 న కాల్చి చంపారు. ఈమెను కూడా హతమార్చడానికి మూడో సారి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఈమె తండ్రిని వారు టార్గెట్ చేశారు.
కాబూల్ లో జరిగే ఉగ్రదాడుల్లో గాయపడిన పౌరులు, సైనికుల సంక్షేమానికి జరీఫా కృషి చేస్తూ వచ్చింది.మూడు వారాల కృతమే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. నేటి పరిణామాల గురించి యువతకు అంతా తెలుసునని, వారికి సోషల్ మీడియా వంటివి ఉన్నాయని, తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో వారికి మంచి అవగాహన ఉందని తెలిపింది. ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉందని ఎంతో ఆశాభావంతో వ్యాఖ్యానించింది. కానీ ఆమె ఆశలన్నీ నీరుగారిపోయాయి. ప్రస్తుతం నిస్సహాయంగా ఉన్న జారీఫా గఫారీ తన లైఫ్ గురించి, తన కుటుంబ సంక్షేమం గురించి తీవ్ర ఆందోళన చెందుతోంది. కాబూల్ నగరం తాలిబన్ల వశం కాదని ఊహించిన ఈమె ఊహాలు కల్లలుగానే మిగిలాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్… ఐటీ రిటర్న్స్ పత్రాలు లేకపోయినా హౌస్ లోన్ గ్యారంటీ..!:ICICI Home Finance Video.