చైనాలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతోంది. వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మృతులతో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అత్యవసరమై బయటకు వస్తే.. కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరిస్తున్నారు. శానిటైజర్ లేనిదే బయటకు రావడం లేదు. ప్రజలే కాదు.. ప్రభుత్వం కూడా ఈ నిబంధనలును కఠిన తరం చేసింది. జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. దీంతో మాస్కు ధరించడం తప్పని సరిగా మారింది. అయితే.. ఏదైనా తినాలన్నా తాగాలన్నా ఇబ్బంది కలుగుతోంది. మాస్కు తీసి ఆహారం తీసుకోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందికి చెక్ పెడుతూ.. వెరైటీగా తయారు చేసిన మాస్కులు చైనా మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. అంతే కాకుండా వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డ్రాగన్ దేశీయులు.. ఆ మాస్కులు ఇంతగా పాపులారిటీ సొంతం చేసుకోవడానికి కారణం ఏమిటో మనమూ తెలుసుకుందాం.
ఈ మాస్కులను పక్షి ముక్కు ఆకారంలో తయారు చేశారు. ఇవి ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒకసారి పెట్టుకుంటే.. తీయాల్సిన అవసరం లేదు. నోరు తెరిస్తే ఆటోమేటిక్‌గా అది కూడా తెరుకుంటుంది. నోరు మూసేస్తే మూసుకుపోతుంది. చైనాలోని రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఈ మాస్కు ధరించి ఆహారం తింటుండటం ఆందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను దిల్లీకి చెందిన సఫీర్ అనే వ్యక్తి తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
Bulls like me feeding on stocks today despite the covid fears after wearing mask. pic.twitter.com/W9LB2QRjSc
— Safir (@safiranand) December 23, 2022
మరోవైపు.. బీఎఫ్ – 7 వేరియంట్ ప్రభావం చైనాలో అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని చైనా ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. బిఎఫ్.7 వేరియంట్ చైనాలో మాత్రమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. చైనాలో వ్యాప్తి చెందుతున్నంత వేగంగా ఇతర దేశాల్లో వ్యాప్తి చెందకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో బిఎఫ్.7 వేరియంట్ వ్యాప్తి చెందడానికి అక్కడి ప్రజల వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటమే కారణంగా తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి