కొడుకును కేసు నుంచి బయటకు తెచ్చేంది 90 ఏళ్ల తల్లి పోరాటం.. ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు!

ఒక దోపిడి కేసులో ఇరుక్కున్న కొడుకును బయటకు తెచ్చేందుకు ఒక 90 ఏళ్ల తల్లి చేసిన పోరాటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక దోపిడి( బ్లాక్‌ మెయిల్‌ చేసిన కేసులో 2023 ఏప్రిల్‌లో హి అనే వృద్దురాలు కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో తన కొడుకును ఎలాగైనా బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్న తల్లి స్వయంగా తానే చట్టాలను నేర్చుకొని కోర్టులో వాధించాలనుకుంది. ఇందుకోసం చట్టాలను కూడా నేర్చుకుంది.

కొడుకును కేసు నుంచి బయటకు తెచ్చేంది 90 ఏళ్ల తల్లి పోరాటం.. ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు!
Chaina News

Updated on: Aug 10, 2025 | 7:38 PM

కొడుకును దోపిడి కేసులోంచి బయటకు తెచ్చేందుకు 90 ఏళ్ల తల్లి చట్టాలను నేర్చుకొని కేసును వాధించిన ఘటన చైనాలో జరిగింది. స్థానికంగా నివాసం ఉండే హి అనే వృద్దురాలు కుమారు లిన్‌ను ఏప్రిల్‌ 2023లో ఒక బ్లాక్‌ మెయిల్‌ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే పోలీసులు కొడుకు చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్న దృశ్యాన్ని తొలిసారిగా చూసి ఆ తల్లి చలించి పోయింది. కోడుకుని ఎలాగొలా కేసు నుంచి బయటకు తీసురావాలని నిర్ణయించుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఆమె తన కొడుకును చాలా మిస్ అవుతున్నందున గత సంవత్సరం న్యాయవాద వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకుంది. కానీ వృద్ధాప్యం కారణంగా కుటుంబంసభ్యులు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆమె అస్సలు వెనక్కి తగ్గలేదు. ఎలాగైన చట్టాలను నేర్చుకోవాలని సన్నాహాలు ప్రారంభించింది.

ఇందులో భాగంగానే ఆమె క్రిమినల్ లా, క్రిమినల్ ప్రొసీజర్ లా పుస్తకాలను కొనుగోలు చేసి చదవడం స్టార్ట్ చేసింది. పుస్తకాలు, జర్నల్స్ చదవడమే కాకుండా, 90 ఏళ్ల వయసులో ఆ తల్లి కొడుకు కేసు తరహా ఇతర కేసులకు సంబంధించిన పాత పత్రాలను అధ్యయనం చేయడానికి ప్రతిరోజూ కోర్టును వెళ్లేది. ఇలా ఆమె మొత్తానికి కొడుకు తరపున వాధించేందుకు సిద్ధమైంది. అయితే జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ మున్సిపల్ ఇంటర్మీడియట్ కోర్టులో కొడుకు కేసు విచారణ కొనసాగుతుండగా.. తన కొడుకు తరపున ఆమె వాదిస్తున్నారు. ఈ కేసు సంబంధించిన చివరి విచారణ జూలై 30న జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.