
చైనా- నేపాల్ సరిహద్దులో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో గల లాంగ్‌చాంగ్ నగరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించింది. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ ప్రకారం, ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:13 గంటల ప్రాంతంలో ప్రావిన్స్‌లో సంభవించింది. ఈ భూకంప కేంద్రం 29.23 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 105.22 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద.. భూమికి 13 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు పేర్కొంది.
అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లోని భవనాలు పగుళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణం నష్టం జరిగినట్టు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.
అయితే ఈ భూకంపం సంభించిన ప్రాంతం నేపాల్ సరిహద్దులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జల ప్రలయంలో ఇబ్బంది పడుతున్న నేపాల్ వాసులను ఈ భూకంపం మరింత భయాందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This video from a hospital in China is heartbreaking. When an earthquake struck, nurses stayed with the babies in the nursery, putting their own lives at risk to protect them.
Contrast that with the reported fire at PIMS Islamabad, where nursery staff allegedly fled while… pic.twitter.com/Xg59e5B2rG
— Dr. Xia Khan (@DrXiakhan) August 28, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.