Mississippi Firing: అమెరికాలో మరోసారి పేలిన తూట.. నలుగురు మృతి , 12 మందికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిసిసిపీలోని లేలాండ్‌ పట్టణంలో అర్థరాత్రి కొందరు దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో స్పాట్‌లోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Mississippi Firing: అమెరికాలో మరోసారి పేలిన తూట.. నలుగురు మృతి , 12 మందికి గాయాలు
Mississippi Firing

Updated on: Oct 12, 2025 | 12:09 AM

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిసిసిపీలోని లేలాండ్‌ పట్టణంలో అర్థరాత్రి కొందరు దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో స్పాట్‌లోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని జాక్సన్‌కు ఈశాన్యంగా 120 మైళ్ల (190 కి.మీ) దూరంలో ఉన్న లేలాండ్ అనే చిన్న పట్టణంలోని ప్రధాన వీధిలో అర్ధరాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగాయని స్థానిక నగర మేయర్ జాన్ లీ బిబిసికి తెలిపారు. గాయపడిన వారిలో నలుగురిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలోని మృతదేహాను స్వాధీనం చేసుకున్నారని.. ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి అనుమానితులు ఎవరినీ అదుపులో తీసుకోలేదని.. కానీ వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

అమెరికా సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పూర్వ విద్యార్థుల సమ్మేళనం సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ తర్వాత కొందరు దుండగులు ఈ కాల్పులకు తెలగబడ్డారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని జాక్సన్ నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.