COP26 Summit: అతిచిన్న దేశం.. ప్రపంచానికి వినూత్న సందేశం.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

|

Nov 12, 2021 | 10:04 AM

COP26 Summit: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సూటు బూటు ధరించిన ఓ వ్యక్తి సముద్రం మధ్యలో నిలబడి

COP26 Summit: అతిచిన్న దేశం.. ప్రపంచానికి వినూత్న సందేశం.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Tuvalu
Follow us on

COP26 Summit: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సూటు బూటు ధరించిన ఓ వ్యక్తి సముద్రం మధ్యలో నిలబడి ప్రసంగిస్తున్నాడు. ఈ వీడియో ద్వారా వాతావరణ మార్పులను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు, అనార్థల గురించి ప్రపంచానికి, ఐక్యరాజ్యసమితికి సందేశం పంపాలనుకున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా.. ఒక దేశానికి చెందిన విదేశాంగ మంత్రి. అవును.. తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫె.. మారుతున్న వాతావరణం గురించి ఈ విధంగా వినూత్న రీతిలో సందేశం పంపించారు.

తాజాగా ఐక్యరాజ్య సమితిలో గ్లాస్గో, స్కాట్లాండ్ క్లైమేట్ చేంజ్ కాప్26 సమ్మిట్ నిర్వహించారు. పలువురు ప్రపంచ దేశాధినేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. అధికారిక స్థాయిలో ఈ సమ్మిట్‌పై ఇంకా ఆన్ లైన్ లో వివిధ దేశాలు తమ ఆలోచనలు పంచుకుంటూ వస్తున్నాయి. ఇందులో తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే కూడా పాల్గొన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితికి రికార్డ్ చేసిన సందేశాన్ని పంపాడు. అయితే, ఈ సందేశం వీడియో రికార్డింగ్ చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రదేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోకాలివరకూ తన ఫ్యాంట్ మడత పెట్టుకున్న తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే సముద్రంలో మోకాలి లోతు నీటిలో నిలబడి తన సందేశాన్ని ఇస్తూ రికార్డు చేశారు. సముద్రంలో ఒక పోడియం.. దాని వెనుక పై వరకూ ఫ్యాంట్ పైకి మడచిన కోఫే.. ఆయన వెనుక వీడియో రికార్డింగ్ సరిగా వచ్చేందుకు ఒక నీలితెర. ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో తన సందేశాన్ని రికార్డ్ చేసి ఐక్యరాజ్యసమితికి పంపారు. అదే వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

సైమన్ కోఫే ఈ వీడియో ద్వారా ప్రపంచంలోని వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం వేగంగా పెరుగుతోందని, దీని వల్ల తువాలు లాంటి చిన్న దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని సందేశం ఇచ్చారు. అందువల్ల, వాతావరణ మార్పులను అరికట్టడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రమైన అదేవిధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.. ఈ వీడియో తువాలు అధికారిక టీవీ టీవీబీసీ(TVBC) ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. ఇది తువాలు రాజధాని ఫునాఫుటి మధ్యలో రికార్డ్ చేశారు. ఇంతకీ తువాలు దేశ వైశాల్యం కేవలం 25.9 చదరపు కిలోమీటర్లు. దీని జనాభా 11 వేల 792. అదేవిధంగా మొత్తం 9 ద్వీపాలు ఈ దేశంలో ఉన్నాయి.

Also read:

T20 World Cup 2021: ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ దెబ్బ.. సెమీ-ఫైనల్‌ సూపర్ హీరో ఔట్.. భారత సిరీస్‌కు డౌటే..!

Snake Catcher : పాడేరులో భయంగొలిపిన నల్లత్రాచు.. ఎంతో ఒడుపుగా పట్టేశాడు.. వీడియో

Sandwich Recipe: మీ చిన్నారుల కోసం ఆహా అనే అవోకాడో శాండ్‌విచ్‌ని ఇంట్లోనే తయారు చేయండి..