స్పా సెంటర్‌ పైకప్పులో కొండచిలువ..! పదేళ్లుగా అక్కడే ఆవాసం..!

| Edited By: Srinu

Nov 22, 2019 | 1:17 PM

స్పా సెంటర్‌ అంటేనే ఎప్పుడూ వచ్చిపోయే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. అటువంటి స్పా సెంటర్‌లో ఓ భారీ కొండచిలువ ఆవాసం ఏర్పాటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా పదేళ్ల నుంచి అదే స్పా సెంటర్‌లో నివసిస్తోంది. కానీ, కొండచిలువ ఉన్న విషయం మాత్రం అక్కడ ఎవరికీ తెలియదు. చివరకు ఓ రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా సీలింగ్‌పై నుంచి అమాంతం కిందపడింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన […]

స్పా సెంటర్‌ పైకప్పులో కొండచిలువ..! పదేళ్లుగా అక్కడే ఆవాసం..!
Follow us on

స్పా సెంటర్‌ అంటేనే ఎప్పుడూ వచ్చిపోయే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. అటువంటి స్పా సెంటర్‌లో ఓ భారీ కొండచిలువ ఆవాసం ఏర్పాటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా పదేళ్ల నుంచి అదే స్పా సెంటర్‌లో నివసిస్తోంది. కానీ, కొండచిలువ ఉన్న విషయం మాత్రం అక్కడ ఎవరికీ తెలియదు. చివరకు ఓ రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా సీలింగ్‌పై నుంచి అమాంతం కిందపడింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన ఈ నెల 12న చైనాలో చోటు చేసుకుంది. వెంటనే ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించటంతో వారు పైథాన్‌ను బంధించి సమీప అడవుల్లో వదిలిపెట్టారు.

అయితే, గత పదేళ్లుగా ఈ భారీ కొండచిలువ స్పా సెంటర్‌లోనే ఉన్నట్లుగా దాని యజమాని చెబుతున్నాడు. పార్లర్‌ నిర్మిస్తున్న సమయంలో కూలీలకు కొండ చిలువ కనిపించినట్టు తనతో చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా, అది కనిపించకుండా పోయిందని చెప్పాడు. కానీ, ఇన్ని సంవత్సరాలకు సీలింగ్‌ పై భాగం నుంచి పార్టిషన్ చీల్చుకుని కిందపడటంతో అది ఇన్నేళ్లు అక్కడే తిష్ట వేసి ఉన్నట్లుగా అందరూ భావిస్తున్నారు. ఆ భారీ కొండచిలువ బరువు సుమారుగా 20 కిలోలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.