ఇవి కేవలం డ్రోన్లు మాత్రమే కాదు..అవయవదానానికి వాహకాలు

ఈ మధ్య కాలంలో అవయవదానం పట్ల అవగాహన బాగా పెరిగింది. బ్రెయిన్ డెడ్ అయినవాళ్లు, ప్రమాదాల్లో మృతి చెందిన వారి అవయవాలను డోనేట్ చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు.  మనిషి మరణించాక కూడా.. మరో వ్యక్తి ప్రాణాలను నిలబెట్టడం కేవలం అవయవ దానం ద్వారానే సాధ్యం. అలా చేస్తే చనిపోయినా కూడా ఆ వ్యక్తి అవయవాలు మరొకరిలో బ్రతికే ఉంటాయి. ఇక  అవయవ మార్పిడి కోసం ఆధునిక శాస్త్ర సాంకేతికత కూడా అందుబాటులోకి వస్తోంది. […]

ఇవి కేవలం డ్రోన్లు మాత్రమే కాదు..అవయవదానానికి వాహకాలు
Follow us

|

Updated on: May 01, 2019 | 6:02 PM

ఈ మధ్య కాలంలో అవయవదానం పట్ల అవగాహన బాగా పెరిగింది. బ్రెయిన్ డెడ్ అయినవాళ్లు, ప్రమాదాల్లో మృతి చెందిన వారి అవయవాలను డోనేట్ చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు.  మనిషి మరణించాక కూడా.. మరో వ్యక్తి ప్రాణాలను నిలబెట్టడం కేవలం అవయవ దానం ద్వారానే సాధ్యం. అలా చేస్తే చనిపోయినా కూడా ఆ వ్యక్తి అవయవాలు మరొకరిలో బ్రతికే ఉంటాయి. ఇక  అవయవ మార్పిడి కోసం ఆధునిక శాస్త్ర సాంకేతికత కూడా అందుబాటులోకి వస్తోంది. తాజాగా డొనేట్ చేసిన అవయవాలను అవసరం ఉన్నవారికి చేరవేసేందుకు.. మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు, ఇంజనీర్స్ కలిసి ఓ మానవ రహిత డ్రోన్‌ను రూపొందించారు. అవయవ మార్పిడి కోసం అవసరమైన అవయవాలను తరలించడం ఈ డ్రోన్ ప్రత్యేకత. అవయవ మార్పిడి సమయంలో వీలైనంత త్వరగా.. వాటిని వేరేవాళ్లకు అమర్చాల్సి ఉంటుంది కాబట్టి ప్రతీ సెకను కూడా విలువైనదే. అయితే ప్రస్తుత తరుణంలో.. ట్రాఫిక్, ఇతరత్రా సమస్యల రీత్యా.. అవయవాలను సకాలంలో పేషెంట్ వద్దకు తరలించడం కష్టసాధ్యమైపోయింది. ఈ సమస్యను అధిగమించడానికే మేరీలాండ్ వర్సిటీ వైద్యులు, ఇంజనీర్లు ప్రత్యేక డ్రోన్‌ను రూపొందించారు.

ఈ మానవ రహిత డ్రోన్ ద్వారా 44ఏళ్ల ఓ వ్యక్తి దానం చేసిన కిడ్నీని సకాలంలో పేషెంట్‌కు అమర్చగలిగారు. ప్రపంచంలో ఇలా మానవరహిత డ్రోన్ ద్వారా అవయవాలను తరలించడం ఇదే మొట్టమొదటిసారి. సకాలంలో తరలించలేని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని వేల అవయవాలు వృథాగా పోతున్నాయి. గతేడాది 2700 కిడ్నీలను సకాలంలో గమ్య స్థానానికి చేర్చలేక.. అప్పటికే సమయం మించిపోవడంతో వాటిని వృథాగా పడేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 1.5శాతం అవయవాలు సకాలంలో గమ్యస్థానాన్ని చేరుకోలేకపోతున్నాయి. తాజాగా రూపొందించిన మానవ రహిత డ్రోన్ ద్వారా.. ఒక దాత నుంచి సేకరించిన కిడ్నీని మరో పేషెంట్‌ వద్దకు 10 నిమిషాల్లో తరలిచంగలిగామని వైద్యులు చెప్పారు. 2.8మైళ్ల దూరం అది ప్రయాణించిందని.. విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి చేశామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వస్తే.. అవయవాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో