అనంతలో ఆస్ట్రేలియన్ క్రికెటర్.. ఎందుకో తెలుసా?

Adam Gilchrist Tour To Ananthapuram, అనంతలో ఆస్ట్రేలియన్ క్రికెటర్.. ఎందుకో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా ఆటతీరు అద్భుతంగా ఉందని.. ప్రత్యర్ధులను సైతం వణుకు పుట్టించే ఆటగాళ్లు భారత్ జట్టులో ఉన్నారని ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. తన వ్యక్తిగత పని నిమిత్తం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పగిడిరాయి గ్రామానికి విచ్చేసిన అతడు.. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంను కూడా సందర్శించాడు. అక్కడి గ్రౌండ్స్‌ను పరిశీలించిన తర్వాత మీడియాతో ముచ్చటించాడు.

ఇండియాలో క్రికెట్ ఆటకు బాగా ఆదరణ ఉంది. ఇక్కడి యువత క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా చాలా బలంగా ఉంది. వారిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కత్తిమీదసామే అని వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *