వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఒకే నంబర్‌తో..!

మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా.. మరో న్యూ ఫీచర్‌ను ఈ సంస్థ తీసుకొచ్చింది. త్వరలోనే వాట్సాప్‌లో మరొక అదిరిపోయే ఫీచర్ యూజర్ల ముందుకొచ్చింది. ఇప్పటివరకూ.. వాట్సాప్‌ను ఏ డివైస్‌లోనైనా ఒకేసారి.. ఒకే ఫోన్ నెంబర్‌తో యూజ్ చేసేవాళ్ళం. అయితే.. వేరే మొబైల్‌లో వాట్సాప్ వాడుకోవాలంటే.. అంతకుముందు ఉన్న మొబైల్ నుంచి వాట్సాప్ నంబర్ అకౌంట్‌ను తొలగించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు […]

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఒకే నంబర్‌తో..!
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 5:34 PM

మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా.. మరో న్యూ ఫీచర్‌ను ఈ సంస్థ తీసుకొచ్చింది. త్వరలోనే వాట్సాప్‌లో మరొక అదిరిపోయే ఫీచర్ యూజర్ల ముందుకొచ్చింది. ఇప్పటివరకూ.. వాట్సాప్‌ను ఏ డివైస్‌లోనైనా ఒకేసారి.. ఒకే ఫోన్ నెంబర్‌తో యూజ్ చేసేవాళ్ళం. అయితే.. వేరే మొబైల్‌లో వాట్సాప్ వాడుకోవాలంటే.. అంతకుముందు ఉన్న మొబైల్ నుంచి వాట్సాప్ నంబర్ అకౌంట్‌ను తొలగించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు ఎన్ని డివైస్‌లోనైనా.. ఒకే ఫోన్ నెంబర్‌తో వాడేందుకు వీలవుతుంది. అదెలా అన్నది… వాట్సాప్ సంస్థ తెలియజేయనుంది. అయితే.. ఈ ఫీచర్‌.. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.. సో.. త్వరలోనే కొత్త ఫీచర్‌తో వాట్సాప్ సేవలు మనముందుకు రానున్నాయని తాజా సమాచారం. త్వరలోనే వాట్సాప్‌ను ఎక్కువ డివైస్‌లలో వాడుకునే అవకాశాన్నికల్పించబోతున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో స్పష్టం చేసింది.