పాక్ క్రికెట్ బోర్డుకు భారీ ఫైన్ వేసిన ఐసీసీ

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బీసీసీఐకి వ్యతిరేకంగా డీఆర్సీ (డిస్పూట్ రెజొల్యూషన్ కమిటీ)లో వేసిన కేసులో చుక్కెదురైంది. 2014లో ద్వైపాక్షిక సిరిస్ ఆడేందుకుగాను కుదిరిన ఒప్పందాన్ని విస్మరించినందుకు 450 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ డీఆర్సీలో కేసు పెట్టింది. విచారించిన ఐసీసీ వివాద పరిష్కార కమిటీ పాక్‌దే తప్పని తేల్చింది. అనవసరంగా తమపై నిందలు వేసినందుకు విచారణకైన ఖర్చును చెల్లించాలని బీసీసీఐ తిరిగి పిటిషన్‌ వేసింది. […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:09 pm, Mon, 18 March 19
పాక్ క్రికెట్ బోర్డుకు భారీ ఫైన్ వేసిన ఐసీసీ

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బీసీసీఐకి వ్యతిరేకంగా డీఆర్సీ (డిస్పూట్ రెజొల్యూషన్ కమిటీ)లో వేసిన కేసులో చుక్కెదురైంది. 2014లో ద్వైపాక్షిక సిరిస్ ఆడేందుకుగాను కుదిరిన ఒప్పందాన్ని విస్మరించినందుకు 450 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ డీఆర్సీలో కేసు పెట్టింది. విచారించిన ఐసీసీ వివాద పరిష్కార కమిటీ పాక్‌దే తప్పని తేల్చింది. అనవసరంగా తమపై నిందలు వేసినందుకు విచారణకైన ఖర్చును చెల్లించాలని బీసీసీఐ తిరిగి పిటిషన్‌ వేసింది. ఐసీసీ దానిని ఆమోదించింది. దీంతో పాక్‌ బీసీసీఐకి 1.6 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించింది. ఈ విషయాన్ని పీబీసీ ఛైర్మన్‌ ఎహెసన్‌ మని సోమవారం వెల్లడించారు.

‘మేం ఓడిపోయిన పరిహారం కేసులో దాదాపు 2.2 మిలియన్‌ డాలర్లు ఖర్చైంది. ఐసీసీ ఆదేశించడంతో బీసీసీఐకి మేం 1.6 మిలియన్‌ డాలర్లు చెల్లించాం’ అని మని తెలిపారు. భారత్‌ 2015-2023 మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుందని బీసీసీఐ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని పాక్‌ ఆరోపించింది. అది అవగాహన ఒప్పందం కాదని, కేవలం సూచనప్రాయంగా ఒక కాగితంపై రాసిందని బీసీసీఐ స్పష్టం చేయగా ఐసీసీ భారత్‌ను సమర్ధించింది.