బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో.. రియల్ హీరో కోసం విలన్‏గా మారుతున్న స్టార్..

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విభిన్న సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ప్రస్తుతం చక్ర సినిమా షూటింగ్‏లో బిజీగా మారాడు ఈ యంగ్ హీరో.

బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో.. రియల్ హీరో కోసం విలన్‏గా మారుతున్న స్టార్..
Follow us

|

Updated on: Feb 01, 2021 | 9:58 PM

Actor Vishal Entry in Bollywood: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విభిన్న సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ప్రస్తుతం చక్ర సినిమా షూటింగ్‏లో బిజీగా మారాడు ఈ యంగ్ హీరో. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏కు విశేషస్పందన లభించింది. తాజాగా విశాల్ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సంచలన విషయం ఎంటంటే.. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కోనసాగుతున్న విశాల్.. హిందీలో మాత్రం అందుకు రివర్స్‏లో కనిపించనున్నాడట.

2018లో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఇరుంబు తిరాయ్’ సినిమా (తెలుగులో అభిమన్యుడు)ను హిందీలో రిమేక్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలోని హీరో విశాల్ పాత్రను రియల్ హీరో సోనూసూద్ పోషించనున్నాడని.. అలాగే.. .యాక్షన్ కింగ్ అర్జున్ పాత్రలో విశాల్ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్‏ను ప్రకటించలేదు చిత్రయూనిట్. తమిళంలో సమంత హీరోయిన్‏గా నటించింది. ఇక తమిళ్ వెర్షన్‏కు పీ.ఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Also Read:

అక్షయ్‏కు ప్రత్యర్థిగా ‘గబ్బర్ సింగ్’ యాక్టర్.. అధికారికంగా ప్రకటించిన ‘బచ్చన్ పాండే’ యూనిట్..

Latest Articles