త్రిష జీవితాన్ని మార్చేసిన ఆ రెండేళ్ల షరతు.. అదేంటంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోన్న కథానాయిక త్రిష. దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది.
వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో టాప్ హీరోలందరి సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈరోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు సినీ ప్రముఖులు, నెటిజన్స్. ప్రాజెక్ట్ అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు.
త్రిష క్రిమినల్ లాయర్ కావాలనుకుందట. కాలేజీలో చేరాక మోడలింగ్ పై ఆసక్తి కలిగింది. దీంతో అటు వైపు ప్రయత్నాలు చేస్తుంటే చిన్న చిన్న ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయట.
ఆ తర్వాత జోడి సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ స్నేహితురాలిగా అవకాశం వచ్చింది. పాకెట్ మనీ కోసమైన చేయ్యాలని అనుకుంటే ఇంట్లో తల్లిదండ్రులు నో చెప్పారని తెలిపింది.
ఇక అలక ప్రదర్శిస్తే చివరకు అమ్మ ఒప్పుకుందని.. అదే సమయంలో ఓ సినిమా ఆఫర్ వచ్చిందని.. ఆ విషయం అమ్మకు చెబితే ఆ రంగంపై వెళ్తావని అనుకున్నానని చెప్పిందట.
ఇన్నా్ళ్లు ఏ కష్టం లేకుండా పెరిగావు. ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలుంటాయి. వాటిని తట్టుకోగలగాలి.. రెండేళ్లు ప్రయత్నించు.. కంఫర్ట్ అయితే కొనసాగిచి లేదంటే చదువుకో అని షరతు పెట్టిందట.
ఇక తల్లి పెట్టిన కండీషన్ గుర్తుపెట్టుకుని మంచి మంచి స్క్రిప్టులు ఎంచుకుని విజయాలు సాధించానని.. ఆ తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని గతంలో తెలిపింది.