AP News: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి జగన్ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్ కోరారు.
ఢిల్లీ బయల్దేరి వెళ్లారు మాజీ సీఎం జగన్. గన్నవరం చేరుకున్న జగన్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి హస్తినకు వెళ్లారు. మూడ్రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారు జగన్. ఏపీలో దాడులకు నిరసనగా బుధవారం ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు.. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు. బధవారం ధర్నా తర్వాత.. ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతిని కలవనున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..