వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
కజకిస్థాన్ లో తెలుగు విద్యార్థి మృతి చెందారు. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కవిత దంపతుల కుమారుడు పవన్ తేజేశ్వర్ రెడ్డి కజకిస్తాన్‌లో ఎంబిబిఎస్ చదువుతున్నాడు. ఆదివారం కజకిస్తాన్‌లోని ఓ సరస్సులో సరదాగా ఈతకొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే సరస్సులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి పవన్ తేజేశ్వర్ రెడ్డి మృతి చెందాడు.
Published on: Apr 25, 2024 07:08 PM