మా వెండి వినాయకుడు.. మామూలుగా ఉండదు మరి.. 54 కేజీల సిల్వర్ బిస్కెట్లతో గణేష్ విగ్రహం..

Edited By:

Updated on: Aug 27, 2025 | 2:37 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి బిస్కెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. ఎమ్మిగనూరు కోర్టు రోడ్‌లోని శ్రీశక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో 54 కేజీల వెండి బిస్కెట్లతో రూ. 60 లక్షలు వెచ్చించి విగ్రహన్ని తయారు చేయించారు. విగ్రహం చుట్టూ వెండి వస్తువులతోనే అలంకరించారు.. అలాగే పూజకు ఉపయోగించే చెంబు, గ్లాసులు, ఇతర సామాగ్రిని కూడా వెండి వాటినే వినియోగిస్తున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి బిస్కెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. ఎమ్మిగనూరు కోర్టు రోడ్‌లోని శ్రీశక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో 54 కేజీల వెండి బిస్కెట్లతో రూ. 60 లక్షలు వెచ్చించి విగ్రహన్ని తయారు చేయించారు. విగ్రహం చుట్టూ వెండి వస్తువులతోనే అలంకరించారు.. అలాగే పూజకు ఉపయోగించే చెంబు, గ్లాసులు, ఇతర సామాగ్రిని కూడా వెండి వాటినే వినియోగిస్తున్నారు. ఈ వినాయక వెండి విగ్రహం.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వెండి వినాయకుడిని చూసేందుకు బారులు తీరుతున్నారు. వెండి బిస్కెట్లతో ఏర్పాటు చేయడంతో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ వినాయక విగ్రహం.. ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.

Published on: Aug 27, 2025 02:37 PM