World Skyscraper Day: స్కైస్క్రాపర్స్‌ డే స్పెషల్.. ఆకాశాన్ని తాకే అద్భుతాలు..! ఎవరు కట్టారో తెలుసా..!(వీడియో)

|

Sep 05, 2021 | 6:28 PM

జనారణ్యంలో ఆకాశాన్ని తాకే అద్భుతాల్ని ‘బహుళ అంతస్తుల భవనాలు’ అని పిలుచుకుంటున్నాం. నగరాలకు హారాలుగా మారుతున్న భారీ భవనాలు మన చుట్టూనే బోలెడన్ని ఉన్నాయి. వీటికి అయ్యే ఖర్చు మాత్రమే కాదు..

జనారణ్యంలో ఆకాశాన్ని తాకే అద్భుతాల్ని ‘బహుళ అంతస్తుల భవనాలు’ అని పిలుచుకుంటున్నాం. నగరాలకు హారాలుగా మారుతున్న భారీ భవనాలు మన చుట్టూనే బోలెడన్ని ఉన్నాయి. వీటికి అయ్యే ఖర్చు మాత్రమే కాదు.. కట్టడానికి పట్టే సమయం, వాటి నిర్మాణం వెనుక శారీరక శ్రమ కూడా వాటిలాగే ఆకాశాన్ని అంటుతుంటాయి. అందుకే వీటికంటూ ఒక రోజు కూడా ఉంది. అదే స్కైస్క్రాపర్స్‌ డే. అదే.. బహుళ అంతస్తుల భవనాల దినోత్సవం. దీని అసలు కథేంటో తెలుసుకుందాం.

స్కైస్క్రాపర్స్‌ డే ప్రధాన ఉద్దేశం.. ఏంటంటే దాదాపు 130 ఏళ్లుగా బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం కృషి చేస్తున్న ఇంజినీరింగ్‌ నిపుణులు, ఆర్కిటెక్టర్‌లను గౌరవించుకోవడం, వాళ్ల గురించి తెలుసుకోవడం కోసం ఇలా ఒక రోజును కల్పించుకున్నారు. అయితే మొదటి బహుళ అంతస్తుల భవవాన్ని మొదటగా డిజైన్‌ చేసిన ఘనత ఆర్కిటెక్ట్‌ విలియమ్‌ లె బారోన్‌ జెన్నెకి దక్కింది. 1984 లో చికాగోలోని హోం ఇన్సూరెన్స్‌ భవవాన్ని ప్రపంచంలోని మొట్టమొదటి స్కైస్క్రాపర్‌గా గుర్తించారు.ఇక సెప్టెంబర్‌ 3న ప్రముఖ ఆర్కిటెక్ట్‌ లూయిస్‌ సులైవన్‌ పుట్టినరోజు. ఈయన్ని ఫాదర్‌ ఆఫ్‌ స్కైస్క్రాపర్స్‌ అంటారు. ఈయన మోడ్రనిజానికి కూడా ఫాదర్‌లాంటి వారనే పేరుంది. అమెరికాలోని వెయిన్‌రైట్‌ బిల్డింగ్‌, ది క్రౌజ్‌ మ్యూజిక్‌ స్టోర్‌, యూనియన్‌ ట్రస్ట్‌ బిల్డింగ్‌, ది ప్రూడెన్షియల్‌ బిల్డింగ్‌.. ఇలా ఎన్నో బిల్డింగ్‌లకు చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా ఈయన పని చేశారు. అందుకే సెప్టెంబర్‌ 3ను ‘వరల్డ్‌ స్కైస్క్రాపర్‌’డేగా నిర్వహిస్తున్నారు.

స్కైస్క్రాపర్స్‌ ఆధునిక యుగంలో భారీ భవనాలకు ముద్దుగా పెట్టుకున్న పేరు. కనీసం వంద మీటర్ల నుంచి 150 మీటర్లు ఉంటేనే.. అది బహుళ అంతస్తుల భవనంగా గుర్తిస్తారు. కాకపోతే పది అంతస్తుల కంటే ఎక్కువ ఉండాలి. అన్ని వసతులూ ఉండాలి. ఇక ప్రపంచంలో అతిఎత్తైన బహుళ అంతస్తుల భవనం.. బుర్జ్ ఖలీఫా. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ దుబాయ్‌లో ఉన్న బుర్జ్‌ ఖలీఫా కట్టడం.. ప్రపంచ వింతల్లోనూ చోటు దక్కించుకుంది. అమెరికా ఆర్కిటెక్ట్‌ అడ్రియాన్‌ స్మిత్‌ దీనిని రూపొందించగా.. స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌, మెర్రిల్‌ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించాయి. బిల్‌ బేకర్‌ నిర్మాణ ఇంజినీర్‌గా వ్యవహరించారు.
బుర్జ్‌ ఖలీఫా 828 మీటర్ల ఎత్తుతో 168 అంతస్తులు కలిగి ఉంటుంది. 12 వేల మంది సిబ్బంది ఈ బిల్డింగ్‌ కోసం పని చేశారు ఒకటిన్నర బిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఈ భవనాన్ని కట్టించారు. జనవరి 4, 2010 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏర్పాటు చేసన లిఫ్ట్‌ స్పీడ్‌ గంటకు 65 కిలోమీటర్లు. అంటే రెండు నిమిషాల్లో 124వ అంతస్తుకు చేరుకోవచ్చన్నమాట.
మరిన్ని ఇక్కడ చూడండి: Thalaivii Pre-Release Event: దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ తలైవి ప్రీ రిలీజ్ ఈవెంట్.. (లైవ్ వీడియో).

White Sugar effects: తెల్ల చక్కెర.. వెరీ డేంజరస్.. పిల్లల్లకు అయితే మరి డేంజర్.. జాగ్రత్త సుమీ..(వీడియో).

Bheemla Nayak Song: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై వివాదం.. అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు(వీడియో)

Solar Storm: భూమికి త్వరలో ముప్పు.. అదే జరిగితే ఇంటర్నెట్‌ బంద్‌.. ఆందోళన కలిగిస్తున్న శాస్త్రవేత్తల రిపోర్టు(వీడియో).