పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు

విధుల్లో ఉన్నట్టు కంపెనీని ఏమార్చేందుకు ప్రయత్నించి మౌస్ జిగ్లింగ్‌కు పాల్పడిన ఉద్యోగులపై అమెరికాకు చెందిన బ్యాంక్ వెల్స్ ఫార్గో వేటు వేసింది. వర్క్ ఫ్రం హోంలో ఉంటూ బయట పనులు చూసుకోవడమో, మరే ఇతర పని మీదనో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ మౌస్ జిగ్లింగ్ ను వాడేవారు. అలాంటి వారు కంపెనీని మోసం చేస్తున్నట్టు గుర్తించిన సంస్థ.. ఈ నిర్ణయం తీసుకుంది. అసలు మౌస్ జిగ్లింగ్ అంటే ఏమిటి?

పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు

|

Updated on: Jun 18, 2024 | 8:22 PM

విధుల్లో ఉన్నట్టు కంపెనీని ఏమార్చేందుకు ప్రయత్నించి మౌస్ జిగ్లింగ్‌కు పాల్పడిన ఉద్యోగులపై అమెరికాకు చెందిన బ్యాంక్ వెల్స్ ఫార్గో వేటు వేసింది. వర్క్ ఫ్రం హోంలో ఉంటూ బయట పనులు చూసుకోవడమో, మరే ఇతర పని మీదనో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ మౌస్ జిగ్లింగ్ ను వాడేవారు. అలాంటి వారు కంపెనీని మోసం చేస్తున్నట్టు గుర్తించిన సంస్థ.. ఈ నిర్ణయం తీసుకుంది. అసలు మౌస్ జిగ్లింగ్ అంటే ఏమిటి? సాధారణంగా కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు ఎక్కువ సేపు స్క్రీన్‌ను వాడకుండా ఉంటే సిస్టమ్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్తుంది. అంటే మనం పని చేయడం లేదని అర్థం. పని చేయకపోయినా కంప్యూటర్ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లకుండా మౌస్ జిగ్లర్ నియంత్రిస్తుంది. ఇది మన ప్రమేయం లేకుండానే మౌస్ కర్సర్‌ను కదిలిస్తూ కంప్యూటర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లకుండా నియంత్రిస్తుంది. ఇంటి నుంచి పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు విధుల్లో ఉండగా పని మీద ఎక్కువ సేపు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తున్నారు. మౌస్ జిగ్లింగ్‌కు పాల్పడుతూ ఉద్యోగులు మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించిన కంపెనీ వారిని తొలగించింది. కాగా, ఈ మౌస్ జిగ్లర్‌.. కర్సర్‌ను మాత్రమే కదిలించగలదు. కానీ, మెసేజ్‌లకు స్పందించడం, కాల్స్‌లో పాల్గొనడం వంటివి చేయదు. సో.. అలా వారి గుట్టు రట్టయ్యి.. ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేగంగా వ్యాపిస్తున్న డేంజరస్‌ బ్యాక్టీరియా.. రెండంటే రెండే రోజుల్లో మనిషి ఖతం !!

చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్లిన మహిళ.. మేళ తాళాలతో గ్రామస్థుల ఘన స్వాగతం

జగన్‌ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!

పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన మ్యారేజ్ ఇన్విటేషన్

ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా ఊహించని షాక్

 

Follow us