అమెరికాలోని మసాచుసెట్స్‌కి చెందిన బాలుడు గత ఏడాది సెప్టెంబరులో ఓ చిప్ తిని చనిపోయాడు. ఆ 14 ఏళ్ల బాలుడి మరణానికి గల కారణం తాజాగా తెలిసింది. పాఖీ కంపెనీ విసిరిన ‘‘వన్ చిప్ ఛాలెంజ్’’లో పాల్గొన్నహారిస్ వోలోబా.. అధిక మోతాదులో క్యాప్సైసిన్ అనే ఘాటు పదార్థాన్ని తీసుకోవడం వల్లే చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. వోలోబా గత ఏడాది సెప్టెంబరులో ఈ ఛాలెంజ్‌లో పాల్గొని గుండెపోటుతో మరణించాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అత్యంత ఘాటు చిప్‌లను తయారు చేసే కంపెనీగా ఈ సంస్థ పేరొందింది. దీన్ని మరింత ప్రమోట్ చేసుకోవడానికి వన్ చిప్ ఛాలెంజ్ అమలు చేసింది. మిరపకాయ సారంతో పాటు అత్యంత ఘాటు మసాలాలతో కూడిన చిప్‌ను తయారు చేసి విక్రయించడం ప్రారంభించింది. అదీ శవపేటిక ఆకారంలో ఉండే ప్యాకేజ్‌లో ఉంచి అమ్మింది. ఇది వయోజనులకు మాత్రమేనని ప్యాకింగ్‌పై స్పష్టంగా పేర్కొంది. చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలని పేర్కొంది. పాఖీ కంపెనీ సోషల్ మీడియాలో విసిరింది ఈ వన్ చిప్ ఛాలెంజ్. దీంట్లో పాల్గొనాలనుకునేవారు కంపెనీకి చెందిన ఒక కరోలినా రీపర్ చిప్‌ను తినాలి. తర్వాత ఎటువంటి ఆహారపదార్థం, నీరు తీసుకోకూడదు. దీంట్లో చాలా మంది సెలబ్రిటీలూ పాల్గొనటంతో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ చిప్ తిన్నవారు లైవ్‌లోనే వాంతులు చేసుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో ఈ ఛాలెంజ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2023లో వోలోబా మరణం తర్వాత పాఖీ కంపెనీ ఈ ఛాలెంజ్‌ను ఉపసంహరించుకుంది. మార్కెట్ నుంచి చిప్‌లను వెనక్కి తీసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృశ్యమైన నటుడు.. 24 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు
అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??