AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా సెనెట్ లో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లు

అమెరికా సెనెట్ లో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లు

Phani CH
|

Updated on: Oct 02, 2025 | 4:42 PM

Share

అమెరికా సెనేట్‌లో ఇమ్మిగ్రేషన్ సంస్కరణల బిల్లు ప్రతిపాదనతో H1B, L1 వీసాలపై నియంత్రణలు రానున్నాయి. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ బిల్లును డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ప్రతిపాదించారు. వీసా ఉల్లంఘనలపై కఠిన చర్యలు, అధిక H1B వీసా రుసుము వంటి ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. అయితే, దీని ఆమోదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి బలంగా వినిపిస్తున్న అమెరికా ఫస్ట్ నినాదానికి అనుగుణంగా అమెరికా సెనేట్‌లో ఒక కీలక ఇమ్మిగ్రేషన్ సంస్కరణల బిల్లు ప్రవేశపెట్టబడింది. డెమోక్రాటిక్, రిపబ్లికన్ సెనేటర్లు సంయుక్తంగా ఈ బిల్లును ప్రతిపాదించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం H1B, L1 వీసాలపై నియంత్రణలు విధించడం, తద్వారా అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడం. కంపెనీలు వేలమంది విదేశీ నిపుణులకు లేఆఫ్‌లు ఇస్తూ, అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా, వీసా ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునే ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆందోళనకారులపై పాక్ సాయుధ బలగాల కాల్పులు

Ranbir Kapoor: ప్రయోగానికి రెడీ అవుతున్న రణబీర్‌ కపూర్‌

Spirit: కరీనా ప్లేస్‌లో మలయాళ బ్యూటీకి ఛాన్స్

మళ్లీ మొదలైన యానిమేటెడ్‌ మూవీస్‌ ట్రెండ్‌

విజయదశమికి ముహూర్తాలు పెడుతున్న హీరోలు