డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న జలాంతర్గామి పేల్చివేత వీడియో

Updated on: Oct 20, 2025 | 3:30 PM

అమెరికా సైన్యం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న జలాంతర్గామిని పేల్చివేసింది. ఈక్వెడార్, కొలంబియా నుండి ఫెంటానిల్, ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఈ సబ్‌మెరైన్‌లో నలుగురు మృతి చెందారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను ప్రకటించారు, డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పారు. అయితే, ఈ ఆపరేషన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా జరగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

అమెరికా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో భాగంగా ఒక జలాంతర్గామిని పేల్చివేసింది. సాధారణంగా రక్షణ రంగంలో ఆయుధాల కోసం వాడే జలాంతర్గాములను డ్రగ్స్ రవాణాకు ఉపయోగించడం విస్మయం కలిగిస్తోంది. ఈక్వెడార్, కొలంబియా నుండి అమెరికా వైపు వస్తున్న ఈ సబ్మెరైన్‌లో ఫెంటానిల్ సహా ఇతర మాదక ద్రవ్యాలు ఉన్నాయని వైట్ హౌస్ సమాచారం అందించింది. ఈ ఆపరేషన్‌లో జలాంతర్గామిలోని నలుగురు మృతి చెందారు.

మరిన్ని వీడియోల కోసం :

నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

హైదరాబాద్‌ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్‌ వీడియో

ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా

డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో