Bunkers: అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్..

|

Nov 29, 2024 | 6:50 PM

యుద్ధ సమయాల్లో తమను తాము రక్షించుకోడానికి కొన్ని దేశాల్లో ప్రజలు.. భూగర్భంలో బంకర్లు నిర్మించుకుని అందులో తలదాచుకుంటారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో మిలిటెంట్ల స్థావరాల్లో ఇలాంటి ఎన్నో బంకర్లు ఇటీవల బయటపడ్డాయి. వాటిని గుర్తించి ఇజ్రాయెల్‌ వాటిపై దాడులు చేసి హమాస్‌ కీలకనేతలెందరినో హతమార్చింది. బాంబులకు కూడా చెక్కుచెదరనంత దృఢంగా బంకర్లు నిర్మిస్తారు.

గాజాలో హమాస్ ఉగ్రవాదులు నిర్మించుకున్న భారీ సొరంగాలను ఇజ్రాయెల్ దళాలు ఇటీవల గుర్తించి వీడియోలు విడుదల చేశాయి. అయితే, ఈ బంకర్లన్నీ తాత్కాలికంగా తలదాచుకునేందుకు మాత్రమే అనువుగా ఉంటాయి. ఇటీవలి కాలంలో అణుబాంబు భయాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా నిర్మిస్తున్న ఓ భారీ బంకర్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. అయితే, ఇది పేరుకు మాత్రమే బంకర్. భూమి అడుగున 15 అంతస్తులతో నిర్మిస్తున్న ఈ బంకర్‌లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అణుదాడుల నుంచి దేశాన్ని రక్షించేలా ఈ బంకర్‌ను నిర్మిస్తున్నారు. ప్రపంచం పతనం అంచున ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకునేలా తీర్చిదిద్దుతున్నారు. అత్యంత దృఢమైన ఈ బంకర్‌ను కన్సాస్‌లో నిర్మిస్తున్నారు. ఓ పొలం మధ్యలో దీని ఎంట్రీ గేటు నిర్మించారు. దీనిని ‘సర్వైవల్ కోండో’ అని పిలుస్తున్నారు. ఈ ప్రవేశ ద్వారానికి 8 టన్నుల ఇనుప తలుపు అమర్చారు. ఈ బంకర్‌ను భూమి లోపలి నగరంగానూ అనుకోవచ్చు. భూమికి 200 అడుగుల లోపల 15 అంతస్తులతో ఈ బంకర్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో మనిషి రోజువారీ జీవనానికి అవసరమైన అన్ని వసతులు ఉంటాయి. ఈ భవనంలోని కింది నుంచి నాలుగో అంతస్తులో సూపర్ మార్కెట్ ఉంటుంది. అందులో ఆహారం, పానీయాలు సహా అన్నీ లభిస్తాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్‌, మెడికల్ యూనిట్, పెట్ పార్క్ కూడా ఉంటుంది. అలాగే, చిన్న సినిమా హాల్, మినీ బార్, లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం రూ. 25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.