Ukraine Soldier: వామ్మో..! షాకింగ్‌.. సైనికుడి బిఫోర్‌ ఆఫ్టర్‌ ఫొటోలు.. జెనీవా ఒప్పందాలను కాలరాసిన రష్యా..

|

Oct 05, 2022 | 5:40 PM

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎన్నో హృదయవిదారక దృశ్యాలను కళ్ల ముందుంచింది. తాజాగా రష్యా చెర నుంచి విడుదలైన తమ సైనికుల దుస్థితిని ఉక్రెయిన్‌ వెల్లడించింది. తీవ్ర గాయాలపాలై


ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎన్నో హృదయవిదారక దృశ్యాలను కళ్ల ముందుంచింది. తాజాగా రష్యా చెర నుంచి విడుదలైన తమ సైనికుల దుస్థితిని ఉక్రెయిన్‌ వెల్లడించింది. తీవ్ర గాయాలపాలై, అనారోగ్యంతో కుంగిపోయినప్పటికీ, రష్యా నుంచి బతికి బయటపడ్డాడంటూ మైఖైలో దియనోవ్‌ అనే సైనికుడి చిత్రాలను షేర్‌ చేసింది. అతడి మునుపటి, ప్రస్తుత చిత్రాలు ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఏడు నెలలు గడిచినా యుద్ధం కొనసాగుతుండడంతో..ఎన్నో దయనీయ దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. రష్యా జెనీవా ఒప్పందాలను కాలరాస్తూ నాజీల వారసత్వాన్ని కొనసాగిస్తోందంటూ రష్యాపై ఉక్రెయిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునే క్రమంలో దియనోవ్‌ రష్యా సైనికులకు చిక్కాడు. కాగా, గత బుధవారం విడుదలైన 205 మంది సైనికుల్లో ఇతడు కూడా ఉన్నాడు.దియనోవ్‌కు సంబంధించిన తాజా చిత్రంలో.. అతడు చాలా బలహీనంగా కన్పిస్తున్నాడు. ముఖం, చేతులపై గాయాల గుర్తులున్నాయి. ప్రస్తుతం కీవ్‌ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతడి సోదరి అలోనా తెలిపారు. రష్యా చెరలో అమానవీయ పరిస్థితుల కారణంగా చేతిలో కొంత ఎముకను కోల్పోయాడని చెప్పారు. తన సోదరుడు బరువు పెరిగే వరకు వైద్యులు పూర్తిస్థాయిలో చికిత్స అందించే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా, మానసికంగా బలంగా ఉన్నాడని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 05, 2022 05:40 PM