అమెరికాలో విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఆదాయం పైనా పన్ను

Updated on: Oct 13, 2025 | 6:48 PM

అమెరికాలో చదువు కోవటానికి వెళ్లిన విదేశీ విద్యార్థులను కూడా పన్నుల పరిధిలోకి తీసుకురావాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం వారు అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ఓపీటీ కింద పనిచేసినందుకు వచ్చే మెుత్తాలపై కూడా ట్రంప్ యంత్రాంగం.. పన్నులు వేసేందుకు రంగం సిద్ధం కావటంతో.. చదువుకుంటూ పార్ట్ టైం చేసుకునే వారి ఆదాయం ఇప్పుడున్న దానికంటే 15 శాతం వరకు తగ్గనుంది.

అమెరికాలోని విదేశీ విద్యార్థులు ఇప్పటి వరకు OPT ఫెయిర్ టాక్స్ యాక్ట్ ద్వారా పొందుతున్న పన్ను మినహాయింపులను రద్దుచేయాలని సెనేటర్ టామ్ కాటన్ కొత్త బిల్లుతో ముందుకొచ్చారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(OPT)లో చేరే విదేశీ విద్యార్థులు, వారి యజమానులు ఇద్దరూ ఫెడరల్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్స్ యాక్ట్(FICA) పన్నులు చెల్లించాలి. ఇవి సామాజిక భద్రతతో పాటు మెడికేర్‌ కవర్ చేస్తాయి. కొత్త బిల్లుతో విదేశీ కార్మికులకు అన్యాయంగా దక్కుతున్న పన్ను మినహాయింపులను ముగించాలని అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యత పెంచాలని సెనెటర్ కాటర్ అన్నారు. దీంతో ఓపీటీ ద్వారా F-1 వీసాదారులు US పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 12–24 నెలల వరకు పని అనుభవం పొందవచ్చు. కానీ ఓపీటీ ఫెయిర్ టాక్స్ యాక్ట్ ప్రకారం.. యజమానులు US పౌరులకు అందించే విధంగానే కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. దీనికింద 6.2% సామాజిక భద్రతా పన్ను అలాగే మెడికేర్ పన్నుల రూపంలో 1.45 శాతం ఉద్యోగి ఓనర్ ఇద్దరి నుంచి వసూలు చేయబడుతుంది. ఈ మొత్తం కలిపితే 15.3 శాతం అవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని చట్టపరమైన మార్పులకు సైతం అమెరికా శ్రీకారం చుడుతోందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాడుబడ్డ భవనంపై డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. లోపలి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ??

వానపాము అనుకున్నారా ?? కాదు..ఇది నిజం పామే

రూపాయితో కూడా బంగారం కొనొచ్చు.. ఎలాగంటే..

దీపావళికి 9 రోజులు సెలవులు.. ఇక పండగే పండగ

చైనాకు ట్రంప్‌ బిగ్‌ షాక్‌.. అదనంగా 100 శాతం సుంకాలు