Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాట వినకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయ్‌..ట్రంప్‌ హెచ్చరిక వీడియో

మాట వినకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయ్‌..ట్రంప్‌ హెచ్చరిక వీడియో

Samatha J
|

Updated on: Jun 26, 2025 | 3:32 PM

Share

ఇజ్రాయెల్‌ దాడికి ఇరాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వడంతో.. నేరుగా అమెరికానే రంగంలోకి దిగింది. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై శనివారం రాత్రి అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం అమెరికాలోని వైట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. మరోసారి ఇరాన్‌కు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా ఆయన..“ఇరాన్‌పై విజయవంతంగా దాడి చేశాం. ప్రపంచంలో మరే సైన్యం కూడా ఇలా దాడి చేయలేదు. ఇది అమెరికా సైనిక విజయం.

ఇరాన్ కచ్చితంగా శాంతి చర్చలకు రావాల్సిందే. లేదంటే భవిష్యత్తులో మరింత తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌ అణుస్థావరాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యం అన్న ట్రంప్‌, యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్‌ వచ్చిందన్నారు. ఇరాన్‌ పశ్చిమాసియా దేశాలను భయపెడుతోందని, ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్‌దే అన్నారు. ఇరాన్‌లో దాడులు చేయాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయని, టెహ్రాన్‌ శాంతిని నెలకొల్పకపోతే.. దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. యూఎస్, టెల్‌అవీవ్‌ కలిసి పనిచేస్తాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇక తమపై అమెరికా దాడి చేస్తే.. కచ్చితంగా తిరిగి దాడి చేస్తామని ఇప్పటికే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ప్రకటించి ఉన్నారు. దీంతో.. ఇప్పుడు ఇరాన్‌ నుంచి అమెరికా సైనిక స్థావరాలపై కచ్చితంగా ప్రతి దాడి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే.. రష్యా, చైనా నుంచి ఇరాన్‌కు మద్దతు లభించే అవకాశం ఉందనే వాదనలు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ వార్‌ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇరాన్‌కు మద్దుతగా రష్యా, చైనా వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో

చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో

రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో