woman lottery: నక్క తోక తొక్కింది.. జాక్‌పాట్ కొట్టిన మహిళ.. లాటరీలో కోట్లు.! ఇంట్రెస్టింగ్ వీడియో..

woman lottery: నక్క తోక తొక్కింది.. జాక్‌పాట్ కొట్టిన మహిళ.. లాటరీలో కోట్లు.! ఇంట్రెస్టింగ్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Jul 27, 2022 | 7:52 AM

అమ్మ చెప్పిన మాట వినిరాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది ఓ మహిళ. లాటరీలో కోట్లు రూపాయలు దక్కడంతో ఆనందంలో తేలిపోయింది. అంత డబ్బు తన వద్ద ఉంటుందని కలలో...


అమ్మ చెప్పిన మాట వినిరాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది ఓ మహిళ. లాటరీలో కోట్లు రూపాయలు దక్కడంతో ఆనందంలో తేలిపోయింది. అంత డబ్బు తన వద్ద ఉంటుందని కలలో కూడా ఉహించలేదని సంబరపడిపోతోంది. ఈ సంతోషంలో రాత్రి నిద్ర కూడా పట్టలేదని చెబుతోంది. లాటరీ గెలుచుకున్న 55 ఏళ్ల ఈ మహిళ పేరు గినా డిల్లార్డ్‌. అమెరికాలోని నార్త్ కరోలినాలో నివాసముంటోంది. తల్లితో కలిసి గ్రాసరీ షాప్‌కు వెళ్లింది. అయితే సరదా ఫాస్ట్ ప్లే గేమ్ ఆడమని డిల్లార్డ్‌కు ఆమె తల్లి సూచించింది. అంతకుముందు ఎప్పుడూ డిల్లార్డ్ ఆ ఆట ఆడలేదు. కానీ తల్లి చెప్పింది కదా అని సరదాగా 5 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేసింది. ఆట ఆడాక అదృ‍ష్టవశాత్తు ఆమే 2,54,926 డాలర్ల జాక్‌పాట్ కొట్టింది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ 2కోట్ల రూపాయలకు పైమాటే.తాను లాటరీ గెలుస్తానని అనుకోలేదని డిల్లార్డ్ చెప్పింది. తన తల్లి సలహా వల్లే ఇది జరిగిందని పేర్కొంది. గెలిచిన డబ్బుతో హోం లోన్, కారు లోన్ కట్టేస్తానని, మిగతా మొత్తాన్ని దాచుకుంటానని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 27, 2022 07:52 AM