పింక్ పాంథర్స్.. ఒక్కసారి కమిటైతే..

Updated on: Oct 24, 2025 | 9:14 PM

అంతర్జాతీయ పింక్ పాంథర్స్ గ్యాంగ్ ప్రపంచాన్ని భయపెడుతున్న మోస్ట్ వాంటెడ్ దోపిడీ ముఠా. మెరుపు వేగంతో, హింసకు తావు లేకుండా కోట్ల సంపదను దోచుకెళ్లే ఈ గ్యాంగ్, 35 దేశాల్లో విస్తరించిన నెట్‌వర్క్‌తో 370కి పైగా చోరీలు చేసింది. వారి పకడ్బందీ ప్రణాళిక, ఆ గోల్కొండ వజ్రం కథనం ఆసక్తికరం. పింక్ పాంథర్స్.. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన, అత్యంత ప్రమాదకరమైన దోపిడీ ముఠా.

పింక్ పాంథర్స్.. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన, అత్యంత ప్రమాదకరమైన దోపిడీ ముఠా. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో విస్తరించిన బలమైన నెట్‌వర్క్‌తో, ఈ గ్యాంగ్ రెండు దశాబ్దాలలో 370కి పైగా దోపిడీలకు పాల్పడి దాదాపు 4,500 కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే రక్తం చిందించకుండా, హింసకు తావు లేకుండా చాకచక్యంగా దొంగతనాలు చేయడంలో వీరు దిట్ట. ఈ ముఠా సభ్యులు సెర్బియన్ మిలటరీ నేపథ్యం నుండి వచ్చినవారు. నకిలీ పాస్‌పోర్ట్‌లతో తప్పించుకుంటూ, పట్టుబడటం దాదాపు అసాధ్యంగా మారారు. లండన్‌లోని గ్రాఫ్ డైమండ్స్, టోక్యోలోని జ్యువెలరీ స్టోర్, ప్యారిస్‌లోని హ్యారీ విన్‌స్టన్ బోటిక్ వంటి ఎన్నో చోరీలలో వీరు నిమిషాల్లోనే మిలియన్ల డాలర్ల విలువైన వస్తువులను దోచుకెళ్లారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీటింగ్ బస్సు కి రిజిస్ట్రేషన్.. స్లీపర్ గా మార్చి సర్వీస్..!

ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు

సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్

టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??

ఉత్త పోస్టర్‌ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్