Dating app: డేటింగ్ యాప్‌లో చాటింగ్.. మోసపోయిన అమ్మాయి.. పెళ్లయ్యాక పెద్ద షాక్.!
ఇండోనేషియాలో ఓ అమ్మాయి డేటింగ్ యాప్‌లో యాక్టివ్‌గా ఉండేంది. ఆమెకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చాలాకాలం పాటు చాటింగ్ చేసుకున్న వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. తానో సర్జన్ అని
ఇండోనేషియాలో ఓ అమ్మాయి డేటింగ్ యాప్‌లో యాక్టివ్‌గా ఉండేంది. ఆమెకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చాలాకాలం పాటు చాటింగ్ చేసుకున్న వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. తానో సర్జన్ అని, తనకు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో.. ఆ అబ్బాయి సంపన్నుడు అనుకుని అమ్మాయి టెంప్ట్ అయ్యింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంది. కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. తాను సరైనవాడ్నే పెళ్లి చేసుకున్నానని భావించిన ఆ అమ్మాయి.. చివరికి తన కుటుంబ సభ్యులకు పెళ్లి విషయం చెప్పింది. మొదట్లో కంగుతిన్నా, ఆ తర్వాత ఆమె కుటుంబీకులు వారి పెళ్లిని స్వాగతించారు. అప్పట్నుంచే ఆ అబ్బాయి తన నిజ స్వరూపం బయటపెట్టాడు. వింతగా ప్రవర్తించడమే కాదు, తాను వ్యాపారంలో చాలా కోల్పోయానని, తనకు డబ్బులు కావాలని అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. భర్తకు ఆర్థిక సహాయం అందిస్తే, తిరిగి వ్యాపారంలో నిలదొక్కుకుంటాడని ఆమె 15 లక్షల వరకూ ఇచ్చింది.ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లై చాలాకాలం అయినా వీరి మధ్య లైంగిక సంబంధం లేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ అమ్మాయి, భర్తపై నిఘా పెట్టింది. చివరికి అతడు మగాడు కాదని తెలుసుకుంది. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి.. పోలీసుల్ని ఆశ్రయించింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. వీరికి పెళ్లి జరిగినట్టు చట్టపరమైన డాక్యుమెంట్స్ కూడా లేవు. ప్రస్తుతం ఈ కేసు స్థానిక కోర్టులో నడుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..