ఇండియన్ ఆర్మీకి బుడ్డోడి విరాళం.. పది నెలలుగా చేస్తున్నా వీడియో
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో ప్రతి హృదయం రగిలిపోయింది. మన మహిళల సింధూరం తుడిచేసిన వారిని చావు దెబ్బ కొట్టింది మన సైన్యం. వారు చూపిన ధైర్య సాహసాలన్నీ దేశం మొత్తం చూసింది. అలాంటి ఆర్మీకి కొంతమంది ఫండ్ అందించడం చూశాం. ఆశ్చర్యంగా ఒక బుడ్డోడు కూడా ఫండ్ ఇచ్చి దేశభక్తి చాటుకున్నాడు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బు తక్కువే అయినా విరాళంగా ఇచ్చిన షా దన్వేష్ పై నిట్టనింట ప్రశంసల వర్షం కురుస్తుంది.
తమిళనాడు కరువులోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల షా దన్వేష్ పది నెలలుగా దాచుకుంటున్న డబ్బును కలెక్టర్ కు అందించాడు. భారత సైన్యం పట్ల తనకున్న గౌరవాన్ని వివరించాడు. యుద్ధ సమయంలో మనం అందించే సాయం గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇండియన్ ఆర్మీకి బాలుడి హార్ట్ ఫుల్ సల్యూట్. భారతదేశ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందనిపిస్తుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఇలాంటివి నేర్పించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్లో భారత త్రివిధ దళాలు తమ పోరాట సామర్థ్యాన్ని కనబరిచాయి. ఇటీవల ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన ప్రధాని మోడీ యావత్ భారతావనిని ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగిమరి కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :