Taliban and Afghan Video: క్రికెట్‌పై తాలిబన్లకు మోజు.. స్టేడియంలో అఫ్గాన్ , తాలిబన్ జెండాల సందడి..!(వీడియో)

|

Sep 06, 2021 | 9:02 AM

తాలిబన్లకు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నా చిరాకని వార్తలు విన్నాం. తాజాగా తమలోని క్రికెట్‌ ఫ్యాన్‌ను బయటపెట్టారు. ఓ క్రికెట్‌మ్యాచ్‌ నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోయిన ప్రజలు స్టేడియంకు పోటెత్తారు.

అగస్ట్‌ 15న అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తొలిసారిగా కాబుల్‌లో క్రికెట్ మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా ఓ అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పీస్ డిఫెండర్స్, పీస్ హీరోస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చాలామంది క్రికెటర్లు పాల్గొన్నారు. దీంతో మ్యాచ్‌ చూసేందుకు స్టేడియంలోకి జనం పోటెత్తారు. మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకులు తాలిబన్, అఫ్గాన్ జెండాలను పక్క పక్కనే ఉంచి ఊపడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటేందుకే ప్రజలు ఇలా జెండాల ప్రదర్శన చేశారని తాలిబన్‌ అధికారులు తెలిపారు.

తాలిబన్ల ఆధిపత్య ప్రాంతమైన చమన్ ఉజురి సమీపంలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు దాదాపు 4 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. వారిలో మహిళలు అస్సలు లేకపోవడం గమనార్హం. సాధారణ ప్రేక్షకుల కంటే తాలిబన్లే ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. ఈ మ్యాచ్‌లో పీస్ డిఫెండర్స్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించిందని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు సీఈవో హమీద్ షిన్వరి తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Face Book: నల్లజాతీయుల్ని ‘కోతులు’ అన్నందుకు ఇరకాటంలో పడ్డ FB ..!(వీడియో).

Delta Variant: కొత్త కరోనా మరింత డేంజర్.. భారత్ లో ఏవై.12 కరోనా.. మొదలైన థర్డ్ వేవ్..(లైవ్ వీడియో).

News Watch: విస్తారంగా వర్షాలు. | 700 మంది తాలిబన్ల హతం | టోక్యోలో రికార్డ్.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Fake Police In AP: నకిలీ ఎస్సై నకరాలు.. అసలు పోలీసులకుచిక్కి..వీడియో వైరల్.