Sri Lanka: దిత్వా ధాటికి లంక అతలాకుతలం కన్నీరు పెట్టిస్తున్నదృశ్యాలు

Updated on: Dec 02, 2025 | 2:25 PM

దిత్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది. 334 మంది ప్రాణాలు కోల్పోగా, 370 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో లక్షలాది మంది ప్రభావితమయ్యారు. భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆదుకుంటుంది. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. ఈ తుఫాను ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారి, తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తూ బలహీనపడే క్రమంలో ఉంది. దిత్వా దాటికి శ్రీలంకలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 334 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలంక జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, దాదాపు 11.18 లక్షల మందిపై ఈ విపత్తు ప్రభావం పడింది. ఒక్క కాండీ జిల్లాలోనే 88 మంది మృతి చెందగా, 150 మంది కనిపించకుండా పోయారు. బదుల్లాలో 71 మంది మృతి చెందారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదే పదే గోరువెచ్చని నీరు తాగుతున్నారా ?? జాగ్రత్త

Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Ashika Ranganath: షాకింగ్ ఘటన! స్టార్ హీరోయిన్ బంధువైన అమ్మాయి ఆత్మహత్య

Divya Nikitha: కామనర్ అయినా.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ! లక్కీ గార్ల్‌

Samantha: భూతశుద్ధి ప్రక్రియలో పెళ్లి.. ఈ పెళ్లి విశిష్టత ఏంటంటే ??