AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Phani CH
|

Updated on: Dec 02, 2025 | 1:35 PM

Share

శనగలు, బెల్లం కలిపి తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రొటీన్లు, ఐరన్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉండే ఈ పోషకాహార మిశ్రమం కండరాలను బలోపేతం చేస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తహీనతను నివారించి, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

మన శరీరం బలంగా ఉండాలంటే ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, మినరల్స్ ఉన్న ఆహారం తినడం చాలా ముఖ్యం. బెల్లం, శెనగలు రెండింటితో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శనగల్లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శనగలు, బెల్లం కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ ఉదయం శనగలు, బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా మారుతాయి. వ్యాయాయం చేసే వారు, జిమ్ కు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి శనగలు, బెల్లం దివ్యౌషధం లాంటివి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. ప్రతిరోజూ 100గ్రాముల శనగలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి 19 గ్రాముల ప్రొటీన్ అందుతుంది. ఎసిడిటి సమస్యను తగ్గించడంలో శనగలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్‎లను యాక్టివేట్ చేస్తాయి. శనగలు డైట్ లో చేర్చుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను మెరుగుపరుస్తుంది. దీంతో మీ మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది. శనగలు , బెల్లం కలిపి తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. వీటిలో ఉండే భాస్వరం దంతాలను బలపరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో శనగలు, బెల్లం ఎంతగానో సహాయపడతాయి. అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడతాయి. శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. శనగలు, బెల్లంలో ఐరన్‌ పుష్కలంగా ఉన్న కారణంగా రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలను పెంచి శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్యసమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ashika Ranganath: షాకింగ్ ఘటన! స్టార్ హీరోయిన్ బంధువైన అమ్మాయి ఆత్మహత్య

Divya Nikitha: కామనర్ అయినా.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ! లక్కీ గార్ల్‌

Samantha: భూతశుద్ధి ప్రక్రియలో పెళ్లి.. ఈ పెళ్లి విశిష్టత ఏంటంటే ??