దారి తప్పిన చిన్నారి.. 17 ఏళ్ల తర్వాత ఇంటికి
17 ఏళ్ల క్రితం తప్పిపోయిన పాకిస్తానీ బాలిక కిరణ్, ఇప్పుడు AI ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత సహాయంతో తన కుటుంబంతో తిరిగి కలిసింది. ఇస్లామాబాద్‌లో తప్పిపోయిన కిరణ్ కేసును ఎథీ ఫౌండేషన్ సైబర్ నిపుణుడి సహాయంతో ఛేదించింది. పాత, కొత్త ఫోటోలను పోల్చి చూసి, దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు తమ కుమార్తెను తిరిగి అప్పగించడంలో AI కీలక పాత్ర పోషించింది. ఇది సాంకేతికత మానవ సంబంధాలను ఎలా తిరిగి కలుపుతుందో చూపింది.
ఓ చిన్నారి.. ఐస్‌క్రీమ్ కొనుక్కోవడానికి ఇంటి గడప దాటింది. అంతే.. తప్పిపోయింది. స్టేషన్‌లో నమోదైన ‘మిస్సింగ్ గర్ల్’ ఫిర్యాదు, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, ఏఐ సాంకేతికత… ఆ పాకిస్తానీ యువతిని 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో తిరిగి కలిపాయి. 2008లో ఇస్లామాబాద్‌లో తప్పిపోయిన బాలిక కిరణ్ .. ఇప్పుడు 27 ఏళ్ల యువతిగా కన్నవారి ఒడికి చేరింది. రోడ్డుపై ఏడుస్తున్న బాలికను మానవతామూర్తి అబ్దుల్ సత్తార్ ఎధీ ఇస్లామాబాద్‌లోని అనాధ శరణాలయంలో చేర్పించారు. కిరణ్ తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఎధీ ఫౌండేషన్ ప్రస్తుత చైర్‌పర్సన్ సభా ఎథీ తెలిపారు. ఎథీ ఫౌండేషన్ ఈ ఏడాది మొదట్లో సైబర్ సెక్యూరిటీ నిపుణుడిని సంప్రదించిందనీ అతనికి కిరణ్ ప్రస్తుత ఫొటోలు, ఆమె బాల్యం గురించి తెలిసిన కొద్ది సమాచారాన్ని అందజేశామని సభా తెలిపారు. కేసును సవాలుగా తీసుకున్న సైబర్ నిపుణుడు నబీల్, ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌లో దశాబ్దం క్రితం నమోదైన ‘మిస్సింగ్ గర్ల్’ రిపోర్ట్‌ను గుర్తించారు. ఆ రిపోర్ట్‌లోని పాత ఫొటోలు, కిరణ్ ప్రస్తుత ఫొటోలను, ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ల సహాయంతో విశ్లేషించారు. పాత రూపానికి, ప్రస్తుత రూపానికి పోలికలను ఏఐ కచ్చితత్వంతో అందించడంతో, కిరణ్ కుటుంబాన్ని గుర్తించడం సాధ్యమైంది. టైలర్‌గా పనిచేసే అబ్దుల్ మజీద్, తానే కిరణ్ తండ్రినని ధ్రువీకరిస్తూ కరాచీకి చేరుకున్నారు. కిరణ్ ఫొటోలను పత్రికల్లో వేయించినా ప్రయోజనం లేకుండా పోయిందనీ తన కూతురిని చూస్తానని ఆశ వదులుకున్నట్లు తండ్రి మజీద్ భావోద్వేగానికి లోనయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీనితో మీ సామాన్లు భద్రం
ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు
లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..
జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

