Dinosaur Egg: డైనోసార్ గుడ్డు .. ఏడు కోట్ల ఏళ్లయినా చెక్కుచెదరని రూపం.. వైరల్ అవుతున్న వీడియో..
నొసార్స్ గురించి ఎన్నో విన్నాం. కోట్లాది సంవత్సరాల ముందు జీవించిన ఈ అతిపెద్ద జీవులు కాల క్రమంలో వచ్చిన మార్పుల్లో కనుమరుగైపోయాయి. అయితే, ఇప్పటికీ డైనోసార్స్ కు సంబంధించిన అనేక ఆనవాళ్ళు అక్కడక్కడా దొరుకుతూ వస్తున్నాయి. తాజాగా కోట్లాది ఏళ్ల క్రితం నాటి డైనొసార్ గుడ్డు ఒకటి దొరికింది.
నొసార్స్ గురించి ఎన్నో విన్నాం. కోట్లాది సంవత్సరాల ముందు జీవించిన ఈ అతిపెద్ద జీవులు కాల క్రమంలో వచ్చిన మార్పుల్లో కనుమరుగైపోయాయి. అయితే, ఇప్పటికీ డైనోసార్స్ కు సంబంధించిన అనేక ఆనవాళ్ళు అక్కడక్కడా దొరుకుతూ వస్తున్నాయి. తాజాగా కోట్లాది ఏళ్ల క్రితం నాటి డైనొసార్ గుడ్డు ఒకటి దొరికింది.దక్షిణ చైనా శాస్త్రవేత్తలు డైనోసార్ గుడ్డుకు సంబంధించిన శిలాజాన్ని కనుగొన్నారు. దీనిలో విశేషమేమిటంటే.. దాదాపు 7 కోట్ల సంవత్సరాలు గడిచినా గుడ్డులోపల డైనోసార్ పిండం శిలాజం ఏమాత్రం పాడవకుండా చక్కగా ఉంది. శాస్త్రవేత్తలు ఈ శిలాజ పిండానికి ‘బేబీ యింగ్లియాంగ్’ అని పేరు పెట్టారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సుమారు 7 కోట్ల సంవత్సరాల వయస్సు గల గుడ్డులో కనిపించిన ఈ పిండం శిలాజం ఇప్పటివరకు తెలిసిన అత్యంత పూర్తి డైనోసార్ పిండం. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ శాస్త్రవేత్తల చెబుతున్న దాని ప్రకారం ఈ పిండం ఓవిరాప్టోరోసార్ జాతికి చెందినది.
చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గన్‌జౌ నగరంలో ‘హెకౌ ఫార్మేషన్’ రాళ్లలో బేబీ యింగ్లియాంగ్ కనుగొన్నారు. చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీనిపై పరిశోధన చేస్తున్నారు. ఈ గుడ్డు సుమారు 7 అంగుళాల పొడవు ఉంది. అయితే, దాని లోపల ఉన్న పిల్ల డైనోసార్ శిలాజం తల నుండి తోక వరకు 11 అంగుళాల పొడవు ఉంది. పెద్దయ్యాక ఈ డైనోసార్ 2 నుంచి 3 మీటర్ల పొడవు పెరిగి ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా.. ఈ రెక్కల డైనోసార్ ఓవిరాప్టోరోసార్ జాతికి చెందినది. ఈ జాతికి దంతాలు ఉండవు. వీటికి ముక్కులు, ఈకలు మాత్రమే ఉన్నాయి. అయితే .. డైనోసార్‌లు తమ గుడ్లపై కూర్చుని ఆధునిక పక్షుల్లా పొదిగేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
