యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయాయి. అమెరికాలో జూలియెన్స్ అనే కంపెనీ నవంబర్ 13న నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ బిర్కెన్‌స్టాక్ కంపెనీ సాండిల్స్ 2,20,000 వేల డాలర్లు మన కరెన్సీలో 1.78 కోట్ల రూపాయలు పలికాయి. గోధుమ రంగులో ఉన్న ఈ సాండిల్స్‌ను 1970ల్లో స్టీవ్ జాబ్స్ ఉపయోగించాడు. వీటి మీద స్టీవ్ కాలి ముద్రలు ఉన్నాయి. అందుకని ఈ చెప్పుల్ని ఒకాయన కోటి డెబ్భయి లక్షలకు వేలంలో సొంతం చేసుకున్నాడు. వేలంలో స్టీవ్ జాబ్స్ పాత సాండిల్స్‌కి 60 వేల డాలర్ల ధర వస్తుందని అనుకున్నారు. ఈ సాండల్స్‌కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధర 2,18,750 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల డాలర్లు వచ్చాయి. జూలియెన్స్ కంపెనీ ఈ సాండల్స్‌ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Frog: అచ్చం మనుషుల్లాగే.. ఆసనాలు వేస్తోన్న కప్ప..
Sudigali Sudheer: సుధీర్ అన్న నోట గుడ్ న్యూస్.. ఇక మళ్లీ రచ్చ రచ్చే !!
Sudigali Sudheer: రష్మిని ముట్టుకోను పట్టుకోను !! సుధీర్ రొమాంటిక్ కామెంట్స్
Samantha: థర్డ్ స్టేజ్‌లో సమంత వ్యాధి.. తీవ్ర ఆందోళలో ఫ్యాన్స్..
తాతను కడసారి చూడలేదని.. రమేష్ బాబు కొడుకు ఎమోషనల్