Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కన్నీరు పెట్టించే సీన్.. వీడియో
కష్టపడి కట్టుకున్న ఇల్లు, కన్న కలలు కళ్లెదుటే ధ్వంసమైపోతుంటే ఏ గుండె తట్టుకోగలదు చెప్పండి. ఉక్రెయిన్‌లో ఇలాంటి హృదయవిదారక ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.
కష్టపడి కట్టుకున్న ఇల్లు, కన్న కలలు కళ్లెదుటే ధ్వంసమైపోతుంటే ఏ గుండె తట్టుకోగలదు చెప్పండి. ఉక్రెయిన్‌లో ఇలాంటి హృదయవిదారక ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. 11 రోజులైనా ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగడంలేదు. రష్యా దళాలు చేస్తున్న బీభత్సానికి ఉక్రెయిన్ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఉన్న ఊరు నన్ను విడిచిపో ప్రాణాలైనా మిగులుతయ్ అంటోంది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్లముందే మసిబొగ్గై దర్శనమిస్తోంది. రుణం తీరిందని ఘోషిస్తోంది. రోజూ చూసే చెట్టూచేమ బాంబుల విధ్వంసంతో ఆకుపచ్చని వర్ణానికి బదులు నలుపెక్కిపోయాయి. మూట ముళ్లే సర్దుకుని పొరుగుదేశాలకు పోవడమొక్కటే ‘శరణ్యం’ అంటూ గుంపులు గుంపులుగా జనం లివివ్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్తున్నారు.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos