ప్రాణం తీసిన రోబో.. కూరగాయల బాక్స్‌ అనుకొని !!

|

Nov 10, 2023 | 8:44 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రోబోలో ప్రొఫెసర్‌ బోరా తయారు చేసిన రోబో గన్ను తీయమంటే బన్ను తీసిన సన్నివేశం గుర్తుంది కదా! తాజాగా ఇలాంటి ఘటనే దక్షిణ కొరియా లో ఓ ఫ్యాక్టరీలో నిజంగా జరిగింది. అయితే, సినిమాలో ఆ సన్నివేశం నవ్వుపుట్టించినప్పటికీ.. నిజ జీవిత సంఘటన మాత్రం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. టెక్నాలజీలో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పకనే చెబుతోంది ఈ సంఘటన.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రోబోలో ప్రొఫెసర్‌ బోరా తయారు చేసిన రోబో గన్ను తీయమంటే బన్ను తీసిన సన్నివేశం గుర్తుంది కదా! తాజాగా ఇలాంటి ఘటనే దక్షిణ కొరియా లో ఓ ఫ్యాక్టరీలో నిజంగా జరిగింది. అయితే, సినిమాలో ఆ సన్నివేశం నవ్వుపుట్టించినప్పటికీ.. నిజ జీవిత సంఘటన మాత్రం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. టెక్నాలజీలో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పకనే చెబుతోంది ఈ సంఘటన. దక్షిణ కొరియాలోని ఓ వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ఫ్యాక్టరీలో ఓ మెషీన్‌ రోబో సహాయంతో పనిచేసుంది. కంపెనీ ప్యాకింగ్‌ విభాగంలో పారిశ్రామిక రోబోలను అమర్చారు. ఇవి కూరగాయలతో నింపిన పెట్టెలను తీసి కన్వేయర్‌ బెల్ట్‌పై వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రోబో.. దగ్గర్లో ఉన్న వ్యక్తిని పెట్టెలా భావించి అతణ్ని లాగి బెల్ట్‌పై బలంగా పడేసింది. అది తన మరచేతులతో మనిషిని గట్టిగా పట్టుకున్నప్పుడు అతడి ఛాతి, ముఖం ఛిద్రమయిపోయాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. రోబో అనుసంధానంతో నడిచే ఆ మెషీన్‌.. మనిషిని, కూరగాయలతో ప్యాక్‌ చేసిన పెట్టెతో పోల్చుకోవడంలో విఫలమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాజా సిటీలో ప్రతి వీధిలో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం

వరదలో బస్సు.. తాళ్లసాయంతో బయటకొచ్చిన ప్రయాణీకులు

తొలి విడత గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి అదిరిపోయే రిటర్న్స్‌

కూలీని లక్షాధికారిని చేసిన వజ్రం.. 10 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి కొన్న వ్యాపారి

గుండెపోటుతో యజమాని మృతి.. పొలం నుంచి పరుగున వచ్చిన ఆవు ఏం చేసిందంటే ??

Follow us on