Vladimir Putin: కిమ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన పుతిన్.. అదేంటంటే ??

|

Feb 22, 2024 | 8:24 PM

ఉత్తరకొరియా, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో కిమ్ రష్యాలో పర్యటించి అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపిన నాటి నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా వ్యక్తిగత అవసరాల కోసం పుతిన్ ఒక కారును బహుమతిగా పంపించారు. రష్యాలో తయారు చేసిన కారును పంపించారని ఉత్తరకొరియా అధికారిక మీడియా మంగళవారం తెలిపింది. ఫిబ్రవరి 18న కారు కిమ్ జాంగ్ ఉన్‌ అత్యున్నత స్థాయి సహాయకులకు అందినట్టు ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్‌ఏ రిపోర్ట్ పేర్కొంది.

ఉత్తరకొరియా, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో కిమ్ రష్యాలో పర్యటించి అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపిన నాటి నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా వ్యక్తిగత అవసరాల కోసం పుతిన్ ఒక కారును బహుమతిగా పంపించారు. రష్యాలో తయారు చేసిన కారును పంపించారని ఉత్తరకొరియా అధికారిక మీడియా మంగళవారం తెలిపింది. ఫిబ్రవరి 18న కారు కిమ్ జాంగ్ ఉన్‌ అత్యున్నత స్థాయి సహాయకులకు అందినట్టు ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్‌ఏ రిపోర్ట్ పేర్కొంది. ఈ సందర్భంగా రష్యాకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కృతజ్ఞతలు తెలియజేశారనీ ఈ కారు గిఫ్ట్ అగ్ర నాయకుల మధ్య ఉన్న ప్రత్యేక వ్యక్తిగత సంబంధాలకు స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యానించింది. అయితే ఈ కారును ఏ విధంగా ఉత్తరకొరియా తీసుకెళ్లారనేది స్పష్టం చేయలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: మహేష్‌కు.. జక్కన్న షాకింగ్ కండీషన్ | షణ్ముక్‌ కేసులో బయటపడ్డ సంచలన నిజం