అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌కు పుతిన్ విమానం..వీడియో
చుట్టుపక్కల ఎటు చూసినా ప్రత్యర్థి దేశాలే.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్.. అయినా.. రష్యా నుంచి రయ్ మంటూ ప్రత్యేక విమానంలో ముందుగా ఎంచుకున్న మార్గంలో ఢిల్లీ వచ్చేశారు పుతిన్. ఇరు దేశాల సంబంధాల్లో ఇదో కీలక ఘట్టంగా మారింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి నాటో దేశాలు తమ గగనతలాలను రష్యా వాడుకోకుండా మూసివేశాయి.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాలు, 27 యూరోప్ సమాఖ్య దేశాలు వీటిలో ఉన్నాయి. రష్యా కూడా 30కిపైగా దేశాల విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ ప్రయాణించాల్సిన విమానం పశ్చిమార్ధగోళం నుంచి ఎట్టిపరిస్థితిలోనూ రాలేని పరిస్థితి.దీంతో పుతిన్ విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ల మీదుగా ప్రయాణించి భారత్ చేరుకున్నట్లు తెలిసింది. 2030 దిశగా భారత్–రష్యా సహకారానికి వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ పరిస్థితులు మారినా… భారత్–రష్యాల మధ్య ఉన్న అనుబంధం మాత్రం మరింత బలపడిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన విస్తృత చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో సహకారాన్ని మరింతగా విస్తరించే నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
