ఓ వైపు విమానాలు క్యాన్సిల్..మరో వైపు టికెట్లు ఫుల్ ? వీడియో
ఇండిగో విమానాలు కొన్ని వరుసగా ఐదో రోజూ రద్దు కావడం ప్యాసింజర్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. చివరి నిమిషాల్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని మెసేజ్‌లు రావడం ప్రయాణికులను గందరగోళంలోకి నెట్టింది. అయితే రద్దయిన విమానాలకు టికెట్లు ఆన్‌లైన్‌లో లభిస్తుండటంతో చాలా మంది షాకవుతున్నారు. తనకు జరిగిన అనుభవాన్ని ఓ ప్యాసింజర్ రెడ్డిట్ లో షేర్ చేస్తూ ఎంతో బాధపడ్డారు.
ఇండిగో 2,200 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల్ని రోజూ నడుపుతోంది. దేశ వ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో ఇండిగోకు చెందిన 1,000కు పైగా విమానాలు మాత్రమే రద్దు అయినట్లు తెలిసింది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో వందలాది విమానాల రాకపోకలు ఆగిపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం 48 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 600కు పైగా విమానాలు రద్దయ్యాయి. గడచిన 20 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. డీజీసీఏ అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలే ఈ విమానాల రద్దుకు ప్రధాన కారణమని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. 2024 జనవరిలో ఈ నియమాలను ప్రకటించినా.. ఇప్పటివరకూ వాటిని అమలు చేయలేదు. పైలట్ల డ్యూటీలు, విశ్రాంతి టైమింగ్స్‌పై కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సిబ్బంది కొరత తీవ్రమైంది. దీంతో శుక్రవారం ఢిల్లీ కేంద్రంగా కొన్ని వందల ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. వేలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే చెన్నై, కోయంబత్తూరు, గౌహతి, కోల్‌కతా రూట్‌లలో విమానాలు యధావిధిగా నడిచాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
