ట్రంప్ ర్యాపిడ్‌ ఫైర్‌.. వరుస ఆదేశాలు..

Updated on: Jan 22, 2025 | 5:43 PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశారు. మరుక్షణం నుంచే ఆయన తన మార్క్‌ చూపించడం మొదలు పెట్టారు. తనదైన స్టైల్‌లో పాలనకు శ్రీకారం చుట్టిన ట్రంప్‌ ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకం చేశారు. తొలి ఎనిమిది ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నును జనంలోకి విసిరేసి ఉత్సాహపర్చారు.

దీంతోపాటు మాజీ అధ్యక్షుడు బైడెన్‌ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్‌ వెనక్కి తీసుకొన్నారు. ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడటం ఇలాంటివి ఉన్నాయి. వాక్‌ స్వేచ్ఛకు రక్షణ, దీంతోపాటు జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టిపెట్టాలని అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరుకావాలన్న ఆదేశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్‌ అల్టిమేటమ్‌ జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగింది. ఈమేరకు ట్రంప్‌ నిర్ణయం తీసుకొన్నారు. కొవిడ్‌ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్‌ ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్‌ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్‌ తొలగించారు. గత అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏఐ అభివృద్ధి , ప్రయోగాలపై నియంత్రణలు ఉండేవి. సరిహద్దు గోడ సామగ్రిని విక్రయించాలన్న బైడెన్‌ ఆదేశాలను ట్రంప్‌ వెనక్కి తీసుకొన్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్జీకర్‌ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..! ఆమె ఎవరు?

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. అన్నప్రసాదంలో ఇకపై కొత్త ఐటమ్

Trump – Putin: పుతిన్‌కు మొదటి రోజే షాకిచ్చిన ట్రంప్‌

కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు.. ఏపీ జవాన్ మృ*తి

TOP 9 ET News: రూ.60 కోట్లు పెడితే.. ఇప్పటి వరకు రూ.175 కోట్ల రాబడి