Pigeon Video: ఆ పావురం కోసం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ.. చివరికి విద్యుత్‌ వైర్ల మధ్యలో..(వీడియో)

|

Oct 18, 2021 | 11:45 AM

ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం విరివిగా పెరిగింది..అన్ని రంగాల్లోనూ డ్రోన్‌ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయ రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా పెరు దేశ రాజధాని లీమాలో డ్రోన్‌ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడారు అక్కడి పోలీసులు.

ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం విరివిగా పెరిగింది..అన్ని రంగాల్లోనూ డ్రోన్‌ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయ రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా పెరు దేశ రాజధాని లీమాలో డ్రోన్‌ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడారు అక్కడి పోలీసులు. ఓ పావురం కాలుకు దారం చుట్టుకోవటంతో హైటెన్షన్‌ వైర్‌కు చిక్కుకొని కిందికి వేలాడుతూ.. ఎగరలేక విలవిలాడింది. ఇది గమనించిన పోలీసులు ఆ పావురాన్ని రక్షించడానికి డ్రోన్‌ను ఉపయోగించారు. డ్రోన్‌కు కత్తి కట్టి కరెంట్‌ వైర్ల మధ్య దాన్ని ఆపరేట్‌ చేస్తూ నెమ్మదిగా పావురం కాలుకున్న దారాన్ని కట్‌చేశారు. దీంతో పావురం సురక్షితంగా కిందపడింది. అనంతరం దాని కాలుకు చుట్టుకొని ఉన్న మొత్తం దారాన్ని తొలగించి పంజరంలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని చదవండి ఇక్కడ: News Watch: చేయాల్సింది చాలా ఉంది, ముందస్తుకు వెళ్లం ~కేసీఆర్… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Mohan Babu: లోకేష్‌ను ఓడగొట్టినా.. నా కొడుకుకు తోడున్నాడు.. దటీజ్‌ బాలయ్య ~ మోహన్ బాబు షాకింగ్ నిజాలు (వీడియో)

60 kg Gold: వధువుకు వరుడి బంగారు కానుక..! మోయలేనంత బరువుతో ఎంట్రీ అదుర్స్.. వైరల్ వీడియో..

Blue Stone-ICE Cream: ‘నీలిరంగు రాయి’ ఇచ్చి ఐస్ క్రీం కొనుగోలు చేసిన చిన్నారి.. కట్ చేస్తే సీన్ రివర్స్.. (వీడియో)

Published on: Oct 18, 2021 09:03 AM