Blue Stone-ICE Cream: ‘నీలిరంగు రాయి’ ఇచ్చి ఐస్ క్రీం కొనుగోలు చేసిన చిన్నారి.. కట్ చేస్తే సీన్ రివర్స్.. (వీడియో)
పిల్లలు దేవుడితో సమానమంటారు. వారికి కల్లకపటం తెలీదు. మోసం, ద్వేషం ఏమీ తెలియవు.. స్వచ్ఛమైన మనసుతో అందరినీ ఆకర్షిస్తారు. తాజాగా బ్లూ కలర్ లో ఉన్న ఒక స్టోన్ పట్టుకుని ఉన్న వ్యక్తి ఫోటో ఒకటి ట్విట్టర్ ఖాతలో షేర్ చేశారు ఒక యూజర్.
పిల్లలు దేవుడితో సమానమంటారు. వారికి కల్లకపటం తెలీదు. మోసం, ద్వేషం ఏమీ తెలియవు.. స్వచ్ఛమైన మనసుతో అందరినీ ఆకర్షిస్తారు. తాజాగా బ్లూ కలర్ లో ఉన్న ఒక స్టోన్ పట్టుకుని ఉన్న వ్యక్తి ఫోటో ఒకటి ట్విట్టర్ ఖాతలో షేర్ చేశారు ఒక యూజర్. అంతేకాదు తాను ఆ నీలిరంగు రాయి కలిగిన ధనవంతుడిని అంటూ కామెంట్ జత చేశారు. నెటిజన్ల మనసు దోచుకున్న పోస్టు గురించి వివరాల్లోకి వెళ్తే..
తాను ఐస్ క్రీమ్ అమ్ముతున్న సమయంలో ఓ చిన్నారి ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వచ్చింది, అప్పుడు ఆ చిన్నారి చేతిలో ఓ నీలి రంగు రాయి ఉంది. ఆ రాయిని నా చేతిలో పెట్టి.. ఇది నాకు దొరికింది. దీనిని మీకు ఇస్తే.. నాకు ఐస్ క్రీమ్ ఇస్తారా అంటూ అమాయకంగా ఆ చిన్నారి అడిగింది. దీంతో నేను ఆ చిన్నారి దగ్గర నుంచి ఆ నీలి రంగు రాయిని తీసుకుని ఐస్ క్రీమ్ ఇచ్చాను. కనుక ఇప్పుడు నేను నీలి రంగు రాయి ఉన్న ధనవంతుడిని అంటూ చెప్పుకొచ్చారు ఆండ్రూ హిల్లరీ .. అయితే ఫోటో తో పాటు.. తాను ఇలా ఐస్ క్రీమ్ ను డబ్బులకు బదులు నీలి రంగు రాయికి ఇచ్చినట్లు తన యజమానికి చెప్పవద్దు అంటూ తనలోని కామెడీ సెన్స్ ను కూడా బయటపెట్టాడు హిల్లరీ. ఈ పోస్టు నెటిజన్ల మనసు దోచుకుంది. భారీ స్పందన వస్తుంది. 7 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. “పిల్లలు చాలా అమాయకులు, కొందరు పెద్దలు చాలా దయగలవారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు డబ్బు కోసం ఆశించకుండా ఆ పసి మనసుని సంతోష పెట్టిన దయామయుడివి అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Petrol and Vegetables Prices Video: పండగ వేళ కంగారు పెడుతున్న కూరగాయలు మరియు ఇంధనం ధరలు..(వీడియో)
Film Festival in Egypt: షాకింగ్ వీడియో.. ఫిల్మ్ ఫెస్ట్ హాల్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు..
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

