గుండెపగిలే వార్త తెలియక..కుమారుడి రాకకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..
బస్టాండ్ పక్కన అరటిపండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే చిన్న కుటుంబం. ఇద్దరు కుమార్తెల తర్వాత కలిగిన ఏకైక కుమారుడు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. స్థోమతకు మించి కష్టపడి కుమారుడిని చదివించారు. తమ కుమారుడు చదువులో, ఉద్యోగంలో.. జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే చూసి మురిసిపోయారు. తమ కలలు నిజమయ్యాయని సంతోషించే లోపే కాలానికి కన్నుకుట్టింది. కుమారుడిని ఉగ్రదాడిలో కుమారుడ్ని బలితీసుకుంది. అన్నెంపున్నెం ఎరుగని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కానీ ఆ వృద్ధ తల్లిదండ్రులు తమకుమారుడు విహార యాత్రకు వెళ్లాడు.. కోడలితో..మనవళ్లతో తమదగ్గరకి వస్తాడు అని కొండంత ఆశతో ఎదురుచూస్తున్న వారికి కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనే వార్త తెలియదు. తెలిసినవారు చెప్పేందుకు సాహసించడంలేదు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి తిరుపాల్,పద్మావతి దంపతులు దయనీయ పరిస్థితి ఇది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్‌రావు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. అతని వయసు 42 ఏళ్లు. ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన బెంగళూరులోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వేసవి సెలవులకు భార్య, పిల్లలతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్‌రావు మృతిచెందారు. తమ కుమారుడు చనిపోయాడన్న విషయం తెలియక ఆయన తల్లిదండ్రులు బుధవారం కూడా అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ కనిపించారు. ప్రతిరోజూ ఫోన్ చేసి మాట్లాడే కుమారుడు మంగళవారం ఫోన్ చేయకపోవడంతో ఏం జరిగిందో అని కుమారుడ్ని తలుచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. కుమారుడి మరణ వార్త ఆ కన్నవారికి తెలియదు. చెబితే ఆ వృద్ధుల గుండెలు పగిలిపోతాయని బంధువులు ఎవరూ సాహసించలేదు. ఈ క్రమంలో భారత సైనికులు తీసుకువచ్చిన కుమారుడి మృతదేహాన్ని చూసి హతాశులయ్యారు. భార్యబిడ్డలతో సంతోషంగా వస్తాడనుకకున్న కుమారుడు శవమై ఇంటికి రావడంతో వారి రోదనలు మిన్నంటాయి. మధుసూదన్‌రావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఇంటర్ చదువుతుండగా..మరొకరు 8వ తగరతి చదువుతున్నారు. మధుసూదన్ మృతదేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నాదేండ్ల మనోహర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో
జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో
ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్..పడిపోయిందా ఒకే..! లేదంటే వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

