గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్‌ స్టార్టప్‌

|

Dec 16, 2023 | 11:20 AM

హైవేల మీద పెట్రోల్‌ పంపులు, గ్యాస్‌ రీఫిల్లింగ్‌ స్టేషన్లు ఉన్నట్టే రోదసిలోనూ ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు, ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్‌ పంపులు అవసరం.. అంతరిక్షంలో ఎందుకు అనేగా మీ అనుమానం. అయితే, రోదసిలో అధునాతన గ్యాస్‌ స్టేషన్లు, ఇంధన స్టేషన్ల నిర్మాణానికి ఓ అమెరికా స్టార్టప్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఆ కంపెనీ నిర్ణయంపై అంతరిక్ష పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూడా.

హైవేల మీద పెట్రోల్‌ పంపులు, గ్యాస్‌ రీఫిల్లింగ్‌ స్టేషన్లు ఉన్నట్టే రోదసిలోనూ ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు, ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్‌ పంపులు అవసరం.. అంతరిక్షంలో ఎందుకు అనేగా మీ అనుమానం. అయితే, రోదసిలో అధునాతన గ్యాస్‌ స్టేషన్లు, ఇంధన స్టేషన్ల నిర్మాణానికి ఓ అమెరికా స్టార్టప్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఆ కంపెనీ నిర్ణయంపై అంతరిక్ష పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూడా. భూమి నిర్ణీత కక్ష్యలో ఇంధన డిపో, గ్యాస్‌ స్టేషన్‌ల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన స్టార్టప్‌ సంస్థ ‘ఆర్బిట్‌ ఫ్యాబ్‌’ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ రిసెర్చ్‌ ల్యాబోరేటరీతో కలిసి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇంధనం అయిపోయిన ఉపగ్రహాలు, వాహకనౌకలు రోదసిలో అదేపనిగా తిరుగుతున్నాయి. శిథిలాలుగా మారిన వాటితో అంతరిక్ష కాలుష్యం మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఒకవేళ వాటిని గ్యాస్‌ లేదా ఇంధనంతో తిరిగి నింపితే, సేవలను కొనసాగించవచ్చన్న అభిప్రాయం ఇప్పటికే చాలా మంది అంతరిక్ష నిపుణుల్లో ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని

Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్‌ చరణ్‌ వీడియో…

Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!

అమ్మాయిపై అత్యాచారం.. అరెస్ట్ అయిన యూట్యూబర్‌

Ramajogayya Sastry: కుక్కల చేతుల్లో సోషల్ మీడియా.. రామజోగయ్య సీరియస్