Serum Institute: కోవిడ్ వ్యాక్సిన్ రూపకర్త.! లండన్‌లో రూ. 1444 కోట్లతో ఆస్తుల కొనుగోలు..
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారుచేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, బిలియనీర్ ఆదార్ పూనావాలా లండన్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ మ్యాన్షన్ విలువ దాదాపు రూ. 1444.4 కోట్లని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. పాలిష్ వ్యాపారి జాన్ కుల్జిక్ కూతురు డొమినిక కుల్జిక్ ఈ ప్రాపర్టీని పూనావాలాకు విక్రయించిందని సమాచారం.
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారుచేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, బిలియనీర్ ఆదార్ పూనావాలా లండన్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ మ్యాన్షన్ విలువ దాదాపు రూ. 1444.4 కోట్లని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. పాలిష్ వ్యాపారి జాన్ కుల్జిక్ కూతురు డొమినిక కుల్జిక్ ఈ ప్రాపర్టీని పూనావాలాకు విక్రయించిందని సమాచారం. పూనావాలా కుటుంబానికి చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ సబ్సిడరీ సీరం లైఫ్ సైన్సెస్ ఈ ప్రాపర్టీని సొంతం చేసుకుంది. లండన్‌లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయడంతో పూనావాలా కుటుంబం బ్రిటన్‌కు మకాం మార్చే ప్రణాళికలు లేవని సీరం లైఫ్ సైన్సెస్ ప్రతినిధి పేర్కొన్నారు. వారు బ్రిటన్‌ను సందర్శించిన సమయంలో కంపెనీ, కుటుంబానికి ఈ ప్రాపర్టీ కీలక బేస్‌గా ఉంటుందని చెప్పారు. కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్ పేరుతో సీరం ఇనిస్టిట్యూట్ పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేసి కోట్లాది భారతీయులకు సరఫరా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

