Maria Branyas: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.

|

Aug 24, 2024 | 5:19 PM

ప్రస్తుత కాలంలో మనిషి 70 ఏళ్ళు బ్రతికితే గ్రేట్‌ అనేలా ఉంది పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ఎంతోమంది మరణిస్తున్నారు. దానికి తోడు వివిధ రకాల వైరస్‌లు మానవాళిపై దాడి చేస్తుండటంతో కొందరు మృత్యువాత పడుతున్నారు. కానీ వీటన్నిటిని తట్టుకొని, ఓ బామ్మ ఏకంగా 117 ఏళ్ల తన జీవన ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన.. ఇటీవలే 117వ పుట్టిన రోజు జరుపుకొన్న ఈ బామ్మ తనువు చాలించింది.

ప్రస్తుత కాలంలో మనిషి 70 ఏళ్ళు బ్రతికితే గ్రేట్‌ అనేలా ఉంది పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ఎంతోమంది మరణిస్తున్నారు. దానికి తోడు వివిధ రకాల వైరస్‌లు మానవాళిపై దాడి చేస్తుండటంతో కొందరు మృత్యువాత పడుతున్నారు. కానీ వీటన్నిటిని తట్టుకొని, ఓ బామ్మ ఏకంగా 117 ఏళ్ల తన జీవన ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన.. ఇటీవలే 117వ పుట్టిన రోజు జరుపుకొన్న ఈ బామ్మ తనువు చాలించింది. మంగళవారం నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచిన మరియా బ్రన్యాస్‌ 117 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అమెరికాలో జన్మించిన స్పెయిన్‌ దేశస్థురాలైన బ్రన్యాస్‌ తాను కోరుకున్నట్లే మంగళవారం నిద్రలో ఎలాంటి బాధా లేకుండా మరణించారు. ఆమె కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది ఫ్రాన్స్‌కు చెందిన 118 ఏళ్ల లూసిల్‌ రాండన్‌ మరణించిన అనంతరం వయోవృద్ధుల అధ్యయన బృందం బ్రన్యాస్‌ను ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ప్రకటించింది. బ్రన్యాస్‌ తరువాతి స్థానంలో జపాన్‌కు చెందిన 116 ఏళ్ల టోమికో ఇతోకా ఉన్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో 1907 మార్చి 4న బ్రన్యాస్‌ మరియా జన్మించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె కుటుంబం స్పెయిన్‌లో స్థిరపడింది.113 ఏళ్ల వయసులో ఆమె కరోనా నుంచి కోలుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on