Rabindranath Tagore villa: అమ్మకానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విల్లా..! లండన్‌లో కొంత కాలం నివాసం ఉన్న సాహితీవేత్త..!(వీడియో)

|

Sep 23, 2021 | 10:31 PM

సాహితీవేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లండన్‌లో కొంత కాలం ఉన్నారు. అప్పట్లో ఆయన నివాసం ఉన్న ఇల్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. గీతాంజలిని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసిన సమయంలో హాంప్‌స్టెడ్‌ హీత్‌లోని హీత్‌ విల్లాలో ఆయన నివసించారు.

సాహితీవేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లండన్‌లో కొంత కాలం ఉన్నారు. అప్పట్లో ఆయన నివాసం ఉన్న ఇల్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. గీతాంజలిని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసిన సమయంలో హాంప్‌స్టెడ్‌ హీత్‌లోని హీత్‌ విల్లాలో ఆయన నివసించారు. అప్పటి నుంచి ఈ విల్లాకు ప్రాముఖ్యత పెరిగింది. 2015లో బెంగాల్‌ సీఎం మమత యూకేను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ విల్లాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. లండన్‌లోని భారత హై కమిషన్‌తో ఆమె అప్పట్లో ఈ విషయంపై మాట్లాడారు.

ఠాగూర్‌ నివసించిన ఆ ఇంటిని ఓ మ్యూజియంగా మార్చాలని సీఎం మమత అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ విల్లా కొనుగోలుపై బెంగాల్‌ ప్రభుత్వంగానీ, కేంద్రంగానీ ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని లండన్‌లో భారత హైకమిషన్‌ తెలిపింది. YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : Worlds Oldest Twins Video: ప్రపంచ కవలల్లో అత్యంత వృద్ధులు వీరే..! చిన్నతనంలో విడిపోయిన తోబుట్టువులు..!(వీడియో)

 Payal Ghosh injured Video: నాపై యాసిడ్ , ఇనుప రాడ్లతో దాడి చేశారు.. నటి పాయల్ సంచలన వ్యాఖ్యలు..!(వీడియో)

 జాతిరత్నాలు డైరెక్టర్‌ దర్శకత్వంలో వెంకీమామ..! ఈ సారి ఓ రేంజ్ లో ఫన్ రిపీట్..(వీడియో)

 Online Gaming: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన బాలుడు.. 19 లక్షలు సమర్పించుకున్నాడు..!(వీడియో)