Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Ghosh injured Video: నాపై యాసిడ్ , ఇనుప రాడ్లతో దాడి చేశారు.. నటి పాయల్ సంచలన వ్యాఖ్యలు..!(వీడియో)

Payal Ghosh injured Video: నాపై యాసిడ్ , ఇనుప రాడ్లతో దాడి చేశారు.. నటి పాయల్ సంచలన వ్యాఖ్యలు..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 23, 2021 | 10:22 PM

గతంలో సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్‏పై తాజాగా యాసిడ్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన కొందరు తనపై యాసిడ్, ఇనుపరాడ్లతో దాడి చేసినట్లుగా పాయల్ తెలిపారు.

గతంలో సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్‏పై తాజాగా యాసిడ్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన కొందరు తనపై యాసిడ్, ఇనుపరాడ్లతో దాడి చేసినట్లుగా పాయల్ తెలిపారు. ముంబైలోని ఓ మెడికల్ షాప్‌లో మందులు తీసుకుని కారులో కూర్చుంటున్న సమయంలో తనపై దాడి చేశారని పాయల్ తెలిపారు. ఇందుకు సంబంధించి తన ఇన్‏స్టాలో ఓ వీడియోను షేర్ చేసారు.

ఆ వీడియోలో పాయల్ మాట్లాడుతూ.. “మెడిసిన్స్ తెచ్చుకోవడానికి నిన్న బయటకు వెళ్లాను. ఆ తర్వాత నా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుండగా.. కొందు నాపై దాడికి యత్నించారు. వారి చేతిలో గ్లాస్‌ బాటిల్ కూడా ఉంది. అందులో యాసిడ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే వాళ్లు నన్ను ఇనుప రాడ్లతో కొట్టేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను. గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఇనుప రాడ్డు నా ఎడమ చేతికి తగిలి గాయమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా.. నా జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ముంబైలో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కంగారుగా ఉంది..అయితే ఈ దాడి ఎవరో తెలిసిన వాళ్లే ప్లాన్ ప్రకారం చేశారు అని అనుమానం వ్యక్తం చేశారు పాయల్.. ఇక తెలుగులో ప్రయాణం సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యారు పాయల్. ఆ తర్వాత ఉసరవెల్లి సినిమాలో సహయనటిగా నటించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : జాతిరత్నాలు డైరెక్టర్‌ దర్శకత్వంలో వెంకీమామ..! ఈ సారి ఓ రేంజ్ లో ఫన్ రిపీట్..(వీడియో)

 Online Gaming: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన బాలుడు.. 19 లక్షలు సమర్పించుకున్నాడు..!(వీడియో)

 బెయిల్‌పై రాజ్‌కుంద్రా విడుదల పై శిల్పాశెట్టి..! మొదటి ఇన్‌స్టా పోస్ట్‌లో సంచలన కొటేషన్‌..(వీడియో)

 Gems Bond car: అమ్మకానికి గన్స్‌ ఉన్న జెమ్స్‌బాండ్‌ కారు.! ఆస్టోన్‌ మార్టిన్‌ సంస్థ నిర్ణయం..(వీడియో)